Gaalodu: సుడిగాలి సుధీర్ సినిమా.. ఓటీటీలో ‘డబుల్ ధమాకా’

ABN , First Publish Date - 2023-02-16T20:38:31+05:30 IST

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా న‌టించిన ‘గాలోడు’ (Gaalodu) సినిమా ఓటీటీలో డబుల్ ధమాకాగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా

Gaalodu: సుడిగాలి సుధీర్ సినిమా.. ఓటీటీలో ‘డబుల్ ధమాకా’
Gaalodu Movie Still

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా న‌టించిన ‘గాలోడు’ (Gaalodu) సినిమా ఓటీటీలో డబుల్ ధమాకాగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్స్‌లో విడుదలై.. టాక్ వీక్‌గా వచ్చినప్పటికీ విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణను సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. సుధీర్ కెరీర్‌లో మ్యాసీవ్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 17న రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల కాబోతోంది. ఇంతకు ముందు ‘ఆహా’లోనే అనేలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) మ‌రియు ఆహా (Aha)లో ప్ర‌సారం కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. (Gaalodu OTT Streaming)

‘గాలోడు’ క‌థేమిటంటే...

ర‌జ‌నీకాంత్ అనే యువ‌కుడు ఏ ప‌నీ పాట లేకుండా ఊరిలో జులాయిగా తిరుతుంటాడు. దాంతో అంద‌రూ అత‌న్ని ‘గాలోడు’ అంటుంటారు. అనుకోకుండా ఓ మ‌ర్డ‌ర్ కేసులో చిక్కుకున్న అత‌డు ఆ నేరం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? శుక్ల (గెహానా సిప్పీ) అనే అమ్మాయి ప్రేమ‌ను ఎలా సొంతం చేసుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. గెహన సిప్పి (Gehna Sippy) హీరోయిన్‌గా నటించగా.. స‌ప్త‌గిరి (Sapthagiri), ష‌క‌ల‌క శంకర్ (Shakalaka Shankar) త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. క‌మ‌ర్షియ‌ల్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచెర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మూవీకి మంచి టాక్ రావడంతో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకి లాభాలను తెచ్చిపెట్టింది.

నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) విషయానికి వస్తే.. ప్రస్తుతం అతనికి ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. ఓ ప్రముఖ కామెడీ షో ద్వారా తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుధీర్.. ఓ వైపు యాంకరింగ్, మరోవైపు నటనని కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే.. సినిమాల్లో కమెడియన్‌గా చేస్తూనే.. ఇంకోవైపు హీరోగా నటిస్తున్నాడు.

Updated Date - 2023-02-16T20:38:34+05:30 IST