BiggBoss Shivaji OTT: బిగ్‌బాస్ శివాజీ రీ ఎంట్రీ.. కొత్త సిరీస్‌ టీజర్ విడుదల చేసిన వెంకీమామ

ABN , First Publish Date - 2023-11-01T20:04:04+05:30 IST

మ‌రో కొత్త వెబ్ సీరీస్ జ‌నాల‌ను వినోదాల ప్ర‌పంచంలో విహ‌రింప చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఎనిమిదేండ్ల త‌ర్వాత‌ శివాజీ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. శివాజీ, తొలిప్రేమ వాసుకి జంట‌గా ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన 90s ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌ అనే ఈ వెబ్‌ సిరీస్ టీజ‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేశ్‌ బుధ‌వారం విడుద‌ల చేశారు.

BiggBoss Shivaji OTT: బిగ్‌బాస్ శివాజీ రీ ఎంట్రీ.. కొత్త సిరీస్‌ టీజర్ విడుదల చేసిన వెంకీమామ
90s

మ‌రో కొత్త వెబ్ సీరీస్ జ‌నాల‌ను వినోదాల ప్ర‌పంచంలో విహ‌రింప చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఈ సినిమాతో ఎనిమిదేండ్ల త‌ర్వాత‌ శివాజీ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. శివాజీ(Shivaji), తొలిప్రేమ వాసుకి జంట‌గా ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన 90s ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌ అనే ఈ వెబ్‌ సిరీస్ టీజ‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేశ్‌ సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్‌లో బుధ‌వారం విడుద‌ల చేశారు. జ‌న‌వ‌రి 5 నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానునట్లు ప్ర‌క‌టించారు.

2014లో చివ‌రిసారిగా ఓ చిన్న సినిమాలో న‌టించిన శివాజీ ఆ మ‌ధ్య రాజ‌కీయాలంటూ సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన ఆయ‌న తిరిగి మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌లే బిగ్‌బాస్‌7లో అడుగు పెట్టిన శివాజీ స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే ఈ సిరీస్ విడుద‌ల కావ‌డం కూడా ఈ సిరీస్‌కు చాలా ఉప‌యోగం కానుంది.


ముఖ్యంగా 90ల‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల నేప‌థ్యం చుట్టూ అల్లుకున్న క‌థ‌తో ఆ కాలాన్ని గుర్తు చేసే స‌న్నివేశాల‌తో ఆధ్యంతం ఆనందం పంచుతూ ఇంటిల్లిపాదిని ఆక‌ట్టుకునేలా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దిన‌ట్లు టీజ‌ర్‌లో క‌నిపిస్తున్న‌ది. దీంతో అంద‌రి దృష్టి ఇప్పుడు ఈ సీరిస్‌పై ప‌డింది. ఈ సిరీస్‌తోనైనా శివాజీ(Sivaji) నిల‌దొక్కుకుంటాడేమో చూడాలి.

Updated Date - 2023-11-01T20:25:58+05:30 IST