Tiger Nageswara Rao: ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు.. ఇప్పుడు మిస్సవకండి
ABN , First Publish Date - 2023-11-17T13:03:11+05:30 IST
దసరా పండుగ సమయంలో పాన్ ఇండియాగా విడుదలైన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా సడీ చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్టోబర్ 20న భగవంత్ సింగ్ కేసరి, లియో వంటి సినిమాలతో పోటీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
దసరా పండుగ సమయంలో పాన్ ఇండియాగా విడుదలైన రవితేజ(Raviteja) టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా సడీ చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్టోబర్ 20న భగవంత్ సింగ్ కేసరి, లియో వంటి సినిమాలతో పోటీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విఇమర్శకుల ప్రశంసలు అందుకని మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్నప్పటికీ మిగతా చిత్రాల స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
స్టువర్టుపురానికి చెందిన గరిక నాగేశ్వరరావు అనే గజ దొంగ జీవిత కథ ఆధారంగా ఫుల్‌యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు కథ, కథనం, సంగీతం ఇంకా సగటు ప్రేక్షకుడికి నచ్చే అన్ని అంశాలను మేళవించి రూపొందించినప్పటికీ సినిమా నిడివి, స్క్రీన్ ప్లే తికమకల వల్ల ప్రేక్షకుల్లో కన్ప్యూజన్ ఏర్పడి అనుకున్న రేంజ్‌లో కలెక్షన్లు తీసుకురాలేక పోయింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చారు.
అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాను థియేటర్లలో విడుదల చేసిన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి తీసుకురావాల్సి ఉన్న ఈ సినిమాను నెల రోజులల లోపే చప్పుడు కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో(PrimeVideoIN)లో తెలుగు, తమిళ , కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోస్ట్రీమింగ్‌కు తెచ్చారు. ఎవరైతే ఈ సినిమాను థియేటర్లలో మిస్సయ్యారో వారు ఇప్పుడు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు.