Ott: ఓటీటీలోకి.. కన్నడ రివేంజ్ యాక్షన్ డ్రామా
ABN , Publish Date - Dec 19 , 2023 | 08:02 AM
వచ్చేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. కన్నడనాట మంచి విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న టోబీ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నారు. గరుడ గమన వృషభ వాహన చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన రాజ్ B శెట్టి హీరోగా నటించాడు.
ఓటీటీలోకి వచ్చేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. కన్నడనాట మంచి విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న టోబీ (Toby ) సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నారు. గరుడ గమన వృషభ వాహన చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన రాజ్ B శెట్టి (Raj B. Shetty) హీరోగా నటించగా సంయుక్త హోర్నాడ్ (Samyukta Hornad) , చైత్ర ఆచార్ (Chaitra Achar), రాజ్ దీపక్ శెట్టి (Raj Deepak Shetty) ప్రధాన పాత్రల్లో నటించగా బాసిల్ అల్చలకల్ (Basil Alchalakkal) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆగస్టు 25 న కన్నడ భాషలో థియేటర్లలో విడుదలవగా పాన్ ఇండియా స్టార్ దుల్హర్ సల్మాన్ తన Wayfarer Films బ్యానర్‌పై మళయాళంలోకి డబ్ చేసి సెప్టెంబరు 22న విడుదల చేయడం గమనార్హం.
కన్నడలో వచ్చిన ఓ 8 పేజీలు మాత్రమే ఉండే చిన్న కథ ఆధారంగా కోస్టల్ కర్ణాటకలోని ఓ జిల్లాలోని ప్రాంతం నేపథ్యలో తెరకెక్కించారు. కథలోకి వెళితే.. తమస్ కట్టేలోని పోలీస్ స్టేషన్‌కు కొత్తగా సంపత్ అనే ఎస్సై విధుల్లో చేరతాడు. అదే సమయంలో జెన్నీ అనే యువతి తన పెంపుడు తండ్రి టోబీ (Toby ) కనబడడం లేదంటూ ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌లోకి దిగుతారు.
ఈ క్రమంలో కుశలప్ప అనే కానిస్టేబుల్ సాయంతో చాలా మందిని ఎంక్వైరీ చేస్తూ టోబీ గురించి తెలుసుకుంటూ వెతుకుతుండగా ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కోక్కటి బయటకు వస్తుంటాయి. టోబీ గొంతు ఎలా కోల్పోయాడు, జైలుకు ఎందుకు వెళ్లాడు, పెళ్లి ఎందుకు చేసుకోలేక పోయాడు, వీటితో ఆ ఊరి పెద్దకు ఉన్న సంబంధేమేంటి వంటి సన్నివేశాలతో ఆసక్తికరమైన కథనంతో రూపొందించారు.
ముఖ్యంగా ఈ సినిమాలో మన చుట్టూ ఉండే గ్రామాల్లో మనకు తరచూ కనిపించే అమాయకపు వ్యక్తులు, వారి జీవన విధానం గురించి చాలా న్యాచురల్‌గా కల్లకు కట్టినట్టుగా చూయిస్తూనే అతనికి కష్టం వస్తే ఏ విధంగా మారాడనే ఇతివృత్తంతో చిత్రం సాగుతుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది.
ఈ సినిమాను కాస్త ఆలస్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ తీసుకు వస్తుండగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం సోనీ లివ్(SonyLIV)లో ఈ నెల డిసెంబర్ 22 నుంచి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. సో మన తెలుగు భాషలోనూ వస్తుంది కాబట్టి చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.