OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ABN , First Publish Date - 2023-01-27T09:43:36+05:30 IST
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు.
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. జనవరి 26న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
డా. 56 (Dr. 56)
డా. 56 అనేది రాజేష్ ఆనందలీల దర్శకత్వం వహించిన ద్విభాషా థ్రిల్లర్ చిత్రం. కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియోస్, హరి హర పిక్చర్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో ప్రియమణి, ప్రవీణ్ రెడ్డి, రాజ్ దీపక్ శెట్టి, రమేష్ భట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 9 డిసెంబర్ 2022న థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కేఎస్‌ఐ: ఇన్ రియల్ లైఫ్ (KSI: In Real Life)
కేఎస్‌ఐ: ఇన్ రియల్ లైఫ్ అనేది అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించిన 2023 బ్రిటిష్ డాక్యుమెంటరీ చిత్రం. ఇది ఇంగ్లిష్ యూట్యూబర్, రాపర్, బాక్సర్ అయిన కేఎస్‌ఐ జీవితం, వృత్తి గురించి తెలుపుతుంది. వెస్లీ పొలిట్ దర్శకత్వం వహించాడు. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
జీ5 (Zee5)
Ayali - తెలుగు, తమిళం
Jaanbaaz Hindustan Ke - తెలుగు, తమిళం, హిందీ
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)
NCIS: Hawai'i - ఇంగ్లిష్
Blue Bloods Season 13 - ఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)
Dear Ishq -హిందీ
How I Met Your Father Season 2 -ఇంగ్లిష్
అదర్ (Other)
Arshi - బెంగాలీ
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
Daniel Spellbound Season 2 - ఇంగ్లిష్