OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-02-10T10:06:22+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఫిబ్రవరి 9న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

రాజయోగం (Rajayogam)

రిషి అనే యువకుడు మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతనికి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ధనవంతుడు అవ్వాలని అనుకుంటాడు. ఈ తరుణంలో అతనికి ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఉండే అవకాశం వస్తుంది. అప్పుడు ఓ డబ్బు ఉందని అనుకొని ఓ అమ్మాయి వెంటపడతాడు. ఈ తరుణంలో నిజంగానే ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ అతని దగ్గర డబ్బులేదని తెలిసి మోసం చేసి వెళ్లిపోతుంది. అదే తరుణంలో రెండు ముఠాలు రూ.10వేల కోట్ల విలువ చేసే వజ్రాల కోసం గొడవ పడుతుంటాయి. వారి మధ్య రిషి ఇరుక్కుంటాడు. ఆ సమయంలోనే అతనికి మరో అమ్మాయి వల్ల నిజమైన ప్రేమ దొరుకుతుంది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనల సమాహారమే 'రాజయోగం'. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

rajayogam.jpg

లవ్‌ కిల్స్: మధుమిత శుక్లా హత్యాకాండ్‌ (Love Kills: Madhumita Shukla Hatyakand)

రాజకీయాలు, ప్రేమ, ఓ హత్య మధుమిత శుక్లా యువతి జీవితంలో పెను మార్పులకి కారణం అవుతుంది. వాటి కారణంగా ఆమెకి ఎదురైన సంఘటనల సమాహారమే 'లవ్‌ కిల్స్: మధుమిత శుక్లా హత్యాకాండ్‌'. ఈ డాక్యుమెంటరీ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్కవరీ ప్లస్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

madhumita.jpg

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

You Season 4: Part 1 - ఇంగ్లిష్‌

Dr Jason Leong: Ride With Caution - ఇంగ్లిష్‌

My Dad the Bounty Hunter - ఇంగ్లిష్‌

Dear David - ఇండోనేషియన్‌

షామారో మీ (Shamaroo me)

Goti Soda Season 3 - గుజరాతీ

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ (Disney plus hotstar)

Not Dead Yet - ఇంగ్లిష్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video)

The Burnt Orange Heresy - ఇంగ్లిష్‌

Updated Date - 2023-02-10T10:06:23+05:30 IST