OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ABN , First Publish Date - 2023-02-03T13:58:42+05:30 IST
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు.

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. ఫిబ్రవరి 3న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
ముఖచిత్రం (Mukhachitram)
యువ నటుడు విశ్వక్ సేన్, చైతన్య రావు, వికాస్ వసిష్ట నటించిన తాజా చిత్రం ‘ముఖచిత్రం’. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రాన్ని పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రాజ్ నిర్మించారు. సందీప్‌పే ఈ మూవీ కథ కూడా అందించాడు. కాల భైరవ సంగీతం అందించాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 9 డిసెంబర్ 2022న విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
సెంబి (Sembi)
ప్రభు సోలమన్ దర్శకత్వం వహించిన తమిళ అడ్వెంచర్ డ్రామా చిత్రం ‘సెంబి’. ఈ చిత్రంలో కోవై సరళ, అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్, తంబి రామయ్య, నాంజిల్ సంపత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 30 డిసెంబర్ 2022న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మూబీ (Mubi)
Phantom Project - స్పానిష్
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
Freeridge - ఇంగ్లిష్