Rules Ranjan: 2 నెలల తర్వాత ఓటీటీలోకి ‘రూల్స్‌రంజన్’.. ఎప్పటి నుంచంటే
ABN , First Publish Date - 2023-11-20T15:45:46+05:30 IST
కిరణ్ అబ్బవరం, డీజే టిల్లు నేహశెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందు సమ్మోమనుడా పాట సృష్టించిన హంగామా, ట్రైటర్ ఈ సినిమాపై హైప్స్ భారీగా పెంచింది. అయితే ఆక్టోబర్ 6న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక డిజాస్టర్ జాబితాలో చేరి పోయింది.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), డీజే టిల్లు నేహశెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ (Rules Ranjan) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందు సమ్మోమనుడా పాట సృష్టించిన హంగామా, ట్రైటర్ ఈ సినిమాపై హైప్స్ భారీగా పెంచింది. అయితే ఆక్టోబర్ 6న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక డిజాస్టర్ జాబితాలో చేరి పోయింది.
అయితే ప్రస్తుతం ఏ సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిందే అలస్యం రెండు మూడు వారాల్లోనే ఓటీటీకి రెడీ అవుతున్న క్రమంలో ఈ రూల్స్ రంజన్ సినిమా ఓటీటీకి రావడానికి రెండు నెలల సమయం ఎందుకు పట్టిందో చాలామందికి తెలియని పరిస్థితి. థియేటర్లో సరైన ఫలితం రాకపోవడంతోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసినట్టు అనుకుంటున్నారు. ఈ మధ్య చాలా సినిమాలు థియేటర్లలో ఫెయిలైనా ఓటీటీల్లో మంచి స్పందన వస్తుంది. కాబట్టి ఈ సినిమాకు అలాంటి రెస్పాన్స్ ఏమైనా వస్తుందేమో చూడాలి.
ఇదిలాఉండగా ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చింది. ముందుగానే చేసుకున్న ఒప్పంద ప్రకారం డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలస్తోంది. కానీ ఆ లోపే ఏదో ఓ సమయంలో విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో సమ్మోహనుడా అనే పాట కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
కాగా కిరణ్ అబ్వరం ప్రస్తుతం మరో మూడు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ‘నేను మీకు బాగా కావల్సిన వాడిని, మీటర్, రూల్స్‌రంజన్’ వరుస పరాజయాలతో కిరణ్ కెరీర్ చిక్కుల్లో పడేలా ఉంది. ఈక్రమంలో ఆయన ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘నేను నటిస్తున్న సినిమాలకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడంలేదని, లాభాల్లో షేర్ మాత్రమే తీసుకుంటున్నానని, నిర్మాత లాస్ అయితే డబ్బులు తీసుకోవడం లేదంటూ’ బహిరంగంగానే ప్రకటించారు.