OTT: ముందుగానే.. ఓటీటీలోకి వస్తున్న కార్తీ ‘జపాన్’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ABN , First Publish Date - 2023-11-21T13:44:00+05:30 IST
సర్దార్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇటీవల దీపావళికి వచ్చిన కార్తీ 25వ చిత్రం జపాన్ త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నది. ఎన్నో అంచనాలతో పండుగ సమయంలో నవంబర్ 10న విడుదలైన ఈ సినిమా ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేక కార్తి కేరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డులోకెక్కింది. దీంతో ఈ సినిమాను త్వరగానే ఓటీటీలోకి తెచ్చేందుకు సదరు సంస్థ రెడీ అవుతున్నది.
సర్దార్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇటీవల దీపావళికి వచ్చిన కార్తీ (Karthi) 25వ చిత్రం జపాన్ (Japan) త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నది. ఎన్నో అంచనాలతో పండుగ సమయంలో నవంబర్ 10న జిగర్తండకు పోటీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుని ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేక కార్తి కేరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డులోకెక్కింది.దీంతో ఈ సినిమాను త్వరగానే ఓటీటీలోకి తెచ్చేందుకు సదరు సంస్థ రెడీ అవుతున్నది.
కామెడీ, మిస్టరీ జానర్‌లో వచ్చిన ఈ సినిమాకు రాజ్ మురుగన్ దర్శకత్వం వహించగా, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల వరకు బిజినెస్ జరుగగా, తెలుగులో దాదాపు 6 నుంచి 7 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే విడుదల అనంతరం నెగెటివ్ టాక్‌తో సినిమా చతికిల పడడంతో మొదటి వారంలోనే చాలా థియేటర్లలో ఈ చిత్రాన్ని తొలగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్ల కలెక్షన్లే టార్గెట్‌గా వచ్చిన ఈ జపాన్ సినిమా పూర్ కలెక్షన్లతో ఫుల్ రన్‌లో రూ.13 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టగా రూ.28 కోట్ల వరకు నష్టాలు చవిచూడక తప్పదని తెలుస్తోంది. అదేవిధంగా తెలుగులోనూ రూ.4 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీంతో కార్తీ (Karthi)సినీ చరిత్రలోనే అతిపెద్ద ప్లాప్ చిత్రంగా జపాన్(Japan) నిలిచింది.
ఇదిలాఉండగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ జపాన్ సినిమా మేకర్స్‌తో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాను డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయాల్సి ఉండగా ఇప్పడు వారు తమ నిర్ణమయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలు ముందుగానే జపాన్ (Japan) సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకు రానున్నట్లు సమాచారం.