Pippa 1971: ఓటీటీలోకి.. భారత్-పాక్ యుద్ద ట్యాంక్ సినిమా
ABN , First Publish Date - 2023-11-02T15:35:09+05:30 IST
మరో ఆసక్తికరమైన చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. 1971 ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ద విజయంలో కీలక పాత్ర పోషించిన పిప్పా (Pippa 1971) అనే యుద్ద ట్యాంకు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎయిర్ లిఫ్ట్ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

మరో ఆసక్తికరమైన చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. మన దేశంలో అరుదుగా వచ్చే వార్ బ్యాక్‌డ్రాప్ లో ఈ సినిమా రూపొందడం విశేషం. 1971 ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ద విజయంలో కీలక పాత్ర పోషించిన ’పిప్పా‘ (Pippa 1971) అనే యుద్ద ట్యాంకు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో అక్షయ్ కుమార్ తో ఎయిర్ లిఫ్ట్ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజా కృష్ణ మీనన్(Raja Menon) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా రోనీ స్క్రూవాలా (Ronnie Screwvala), సిద్ధార్థ కపూర్ (Siddharth Roy Kapur) నిర్మించారు.
పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న బ్రిగేడియర్ బలరాం సింగ్ మెహతా తనే స్వయంగా రాసిన బుక్ ’ది బర్నింగ్ చాఫ్పిస్‘ పుస్తకం ఆధారంగా తీసిన ఈ ’పిప్పా1971‘ సినిమాలో షాహీద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ (Ishaan Khatter) హీరోగా నటించగా ఆయనకు సోదరిగా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్ర పోషించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఈ సినిమా షూటింగ్ 2021లో ప్రారంభమైపనప్పటికీ అన్ని అవరోధాలను దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా అది అందరినీ ఆకట్టుకుంటున్నది. అయితే అశ్చకర్యకరంగా సినిమాను థియేటర్లలో కాకుండా నవంబర్ 10 న డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో(PrimeVideoIN) స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు.