Irugapatru: ఓటీటీలోనూ దూసుకెళుతోన్న ‘ఇరుగపట్రు’

ABN , First Publish Date - 2023-11-25T21:49:50+05:30 IST

యువరాజ్‌ దయాళన్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు పొటెన్షియల్‌ స్టూడియోస్‌ బ్యానరుపై నిర్మించిన ‘ఇరుగపట్రు’ (Irugapatru) చిత్రం విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Irugapatru: ఓటీటీలోనూ దూసుకెళుతోన్న ‘ఇరుగపట్రు’
Irugapatru Movie

యువరాజ్‌ దయాళన్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు పొటెన్షియల్‌ స్టూడియోస్‌ బ్యానరుపై నిర్మించిన ‘ఇరుగపట్రు’ (Irugapatru) చిత్రం విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విక్రమ్‌ ప్రభు - శ్రద్ధా శ్రీనాథ్‌, విదార్ధ్‌ - అపర్ణతి, శ్రీ - సానియ అయ్యప్పన్‌ జంటలుగా నటించారు. వివాహ సంబంధాల్లో చిన్నచిన్న సమస్యలు, ఈగో, వాటి పరిష్కారాలను వెండితెరపై దర్శకుడు అద్భుతంగా మలిచారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కథ, స్ర్కీన్‌ప్లే, సంభాషణలు, నటీనటుల నటన ఇలా ప్రతి అంశం అభిమానుల మన్నలు పొందింది. (Irugapatru in OTT)


Iragapatru.jpg

అక్టోబరు 6న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో కూడా సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్‌ అవుతోంది. నవంబరు 6వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఓటీటీలో విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు టాప్‌-10లో ట్రెండింగ్‌లో ఉందని నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు తెలిపారు. ‘ఈ చిత్రానికి ఇంత అద్భుత స్పందన వస్తుందని ఊహించలేదు. ఎమోషన్‌, రియలిస్టిక్‌ కథాంశం కావడంతో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. భార్యాభర్తలు మధ్య జరిగే చిన్నచిన్న విషయాలు, భావోద్వేగాలు, చిత్ర ఇతివృత్తం ఇలా ప్రతి ఒక్క అంశం ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్‌హిట్‌ సాధించింది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sandeep Reddy Vanga: మహేష్ బాబుకి ఒక కథ చెప్పా.. కానీ?

******************************

*Srikanth: ఈ మ‌ధ్య‌కాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్ర‌శంస‌లు రాలేదు

*******************************

*Surya: డాడీతో పోలిక లేదు.. ఆ పేరు కూడా వాడుకోనంటోన్న విజయ్‌ సేతుపతి కుమారుడు

*******************************

*Natural Star Nani: సినిమా అనేది నిజంగా నా ఊపిరి.. దానిపై ప్రామిస్ చేస్తున్నా..

******************************

Updated Date - 2023-11-25T21:49:52+05:30 IST