Sukumar: అజయ్ ఘోష్ కథ అందించాడా.. అయితే బాగుంటుంది
ABN , First Publish Date - 2023-07-01T21:31:37+05:30 IST
అజయ్ ఘోష్ కథ అందించిన ‘రుద్రమాంబపురం’ చిత్రం చాలా బాగుంటుందని, అందరూ తప్పకుండా చూడాలని కోరారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. మహేష్ బంటు దర్శకత్వంలో ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా సుకుమార్ విడుదల చేసి.. చిత్రయూనిట్ శుభాకాంక్షలు తెలిపారు.
అజయ్ ఘోష్ కథ అందించిన ‘రుద్రమాంబపురం’ చిత్రం చాలా బాగుంటుందని, అందరూ తప్పకుండా చూడాలని కోరారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఎన్‌వీఎల్ (NVL)ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం ‘రుద్రమాంబపురం’ (Rudramambapuram). మహేష్ బంటు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్. శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, ప్రమీల, రజిని శ్రీకళ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మూలవాసుల కథ అనేది ట్యాగ్‌లైన్. జూలై 6 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ (Rudramambapuram Trailer)ను పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ (PAN India Director Sukumar) ఆవిష్కరించారు.
ట్రైలర్ చూసిన తర్వాత సుకుమార్ మాట్లాడుతూ.. రుద్రమాంబపురం.. ఇది మూలవాసుల కథ. ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు అజయ్ ఘోష్ (Ajay Ghosh) కథ అందించాడని తెలిసింది. ట్రైలర్ చాలా బాగుంది.. సినిమా కూడా ఇదే తరహాలో విజయం సాధించాలని, చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇంతకు ముందు దర్శకుడు మారుతి (Director Maruthi) ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అలాగే చిత్రంలోని జాతర సాంగ్‌ను ఇటీవల హీరో శ్రీకాంత్ (Hero Srikanth) విడుదల చేశారు. వాటన్నింటికీ కూడా మంచి స్పందన వచ్చిందని.. తాజాగా సుకుమార్ వదిలిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నందుకు సంతోషంగా ఉందని చిత్రయూనిట్ పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో తిరుపతి పాత్రలో అజయ్ గోష్, పెద్దకాపు మల్లోజుల శివయ్య పాత్రలో శుభోదయం సుబ్బారావు (Subhodayam Subbarao) నటించారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Sudigali Sudheer: ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం.. నిజమేనా?
**************************************
*Miriam Maa: 50 ఏళ్లు పైబడిన ఒక మహిళ కృత్రిమ గర్భధారణను ఎంచుకుంటే..
**************************************
*VV Vinayak: డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల్లో ‘సాక్షి’
**************************************
*TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. దానికి సమాధానమిదే!
**************************************
*D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం
**************************************
*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!
**************************************