Lucky Lakshman: మహా శివరాత్రికి సోహైల్ డబుల్ ఓటీటీ ధమాకా
ABN , First Publish Date - 2023-02-17T22:19:03+05:30 IST
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ (Bigg Boss Telugu fame Sohel), మోక్ష (Mokksha) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’ (Lucky Lakshman). డిసెంబర్ 30న థియేటర్స్‌లో

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ (Bigg Boss Telugu fame Sohel), మోక్ష (Mokksha) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’ (Lucky Lakshman). డిసెంబర్ 30న థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం ‘మహాశివరాత్రి’ సందర్భంగా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి (AR Abhi) దర్శకత్వంలో హరిత గోగినేని (Haritha Gogineni) ఈ సినిమాను నిర్మించారు. మహాశివరాత్రి (Maha Shivaratri) స్పెషల్‌గా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), ఆహా (Aha) ఓటీటీల్లో (OTT Release) డబుల్ ధమాకాగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
‘లక్కీ లక్ష్మణ్’ కథ విషయానికి వస్తే.. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు లక్ష్మణ్ (సయ్యద్ సోహైల్). తండ్రి (దేవీ ప్రసాద్) ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోదు. తను ఏది అడిగినా కొనివ్వలేడు. దీంతో లక్ష్మణ్‌లో తెలియని అసంతృప్తి ఉంటుంది. ఇంజనీరింగ్ చదివే సమయంలో శ్రియ (మోక్ష)తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారుతుంది. తండ్రిపై ఉన్న కోపంతో ఇంట్లో నుంచి లక్ష్మణ్ బయటకు వచ్చేస్తాడు. లక్ష్మణ్ ఆర్థిక పరిస్థితి తెలిసిన శ్రేయ అతనికి సాయం చేస్తుంటుంది. స్నేహితుల సాయంతో సొంతంగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసిన లక్ష్మణ్ అందులో బాగా డబ్బులు సంపాదిస్తాడు. డబులున్నాయనే పొగరుతో ప్రేమను కాదనుకుంటాడు. తల్లిదండ్రులను పట్టించుకోడు. అయితే అనుకోకుండా ఓరోజు తండ్రి స్నేహితుడు కనపడి.. ఆయన గొప్పతనాన్ని, తన కోసం చేసిన త్యాగాన్ని తెలుసుకుని షాకవుతాడు. వారికి దగ్గరవుతాడు. హీరోకి, తన తండ్రికి ఉన్న ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. తండ్రి కొడుకు కోసం చేసే త్యాగాలను గుర్తుకు చేసి హృదయాలను బరువెక్కేలా చేస్తాయి. (Lucky Lakshman Movie Story)
తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ జర్నీలా సాగిన ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందనను రాబట్టుకుందని, ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు. (Lucky Lakshman Ready to Release in OTT)