Bheemadevarapally Branchi: ఓటీటీలోకి వచ్చేసిన భీమదేవరపల్లి బ్రాంచి..

ABN , First Publish Date - 2023-08-18T23:03:15+05:30 IST

తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో.. రమేష్ చెప్పాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రీసెంట్‌గా మైత్రీ మూవీస్ ద్వారా థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సందడి చేస్తోంది.

Bheemadevarapally Branchi: ఓటీటీలోకి వచ్చేసిన భీమదేవరపల్లి బ్రాంచి..
Bheemadevarapally Branchi Posters

తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో.. రమేష్ చెప్పాల (Ramesh Cheppala) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’ (Bheemadevarapally Branchi). రీసెంట్‌గా మైత్రీ మూవీస్ (Mythri Movies) ద్వారా థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నేటివిటీ సినిమాల్ని ఇష్టపడుతున్న నేటి ప్రేక్షకులకి ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా పల్లె ప్రజల జీవన విధానాన్ని, అమాయకత్వాన్ని, సంస్కృతి, సంఘర్షణలని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime)లో స్ట్రీమింగ్ అవుతోంది.


Bheemadevarapally Branchi.jpg

భీమదేవరపల్లి బ్రాంచిలో బలమైన కథ ఉంది.. రాజకీయ నాయకుల తప్పుడు వాగ్దానాలు నమ్మి ప్రజలు ఎలా అవస్థలు పడతారో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఉచిత పథకాల మీద దర్శకుడు తన మాటలతో వ్యంగ్యాస్త్రాలను సంధించాడు. ‘ఉచితాలు అసలు ఉచితాలే కాదు!! అవి మరోరకంగా మన మీద వేసే భారాలు’, ‘ప్రభుత్వాలు పని కల్పించాలి కానీ ప్రజలకు పైసలు ఇవ్వకూడదు’ అంటూ రచయిత -దర్శకుడు రమేష్ చెప్పాల తన సామాజిక స్పృహని.. దృశ్యరూపంగా మార్చారు. అంతా కొత్త వాళ్ళతో, సమాజాన్ని మేల్కొలిపే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటుండని విధంగా దర్శకుడు ఈ సినిమాని మలిచారు. (Bheemadevarapally Branchi Released in OTT)


ఇవి కూడా చదవండి:

***************************************

*Skanda: ‘గందారబాయి’ అంటూ.. రామ్, శ్రీలీల ఓ ఊపు ఊపేశారు

***************************************

*Sampath Nandi: ‘సౌండ్ పార్టీ’.. మరో ‘జాతిరత్నాలు’ అయ్యే సినిమా..

***************************************

*Dulquer Salmaan: ప్రభాస్ ‘కల్కి’లో దుల్కర్.. చెప్పకనే చెప్పేశాడుగా..

***************************************

*Aadikeshava: మెగా హీరో సినిమా వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

***************************************

Updated Date - 2023-08-18T23:03:15+05:30 IST