OTT: ఓటీటీలోకి రెండు ఎమోషనల్ డ్రామాలు

ABN , First Publish Date - 2023-11-14T18:49:11+05:30 IST

ఈ వారం మరో రెండు ఆసక్తికరమైన సినిమాలు ఓటీటీ అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈమ‌ధ్య‌ థ్రిల్ల‌ర్స్‌, కామెడీ, యాక్ష‌న్ జోన‌ర్స్ చాలా సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను అల‌రించగా ఇప్పుడు వాటికి కాస్త భిన్నంగా రెండు ఎమోష‌న‌ల్ జాన‌ర్ సినిమాలు త్వ‌ర‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

OTT: ఓటీటీలోకి రెండు ఎమోషనల్ డ్రామాలు
800, vadhuvu

ఈవారం మరో రెండు ఆసక్తికరమైన సినిమాలు ఓటీటీ అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈమ‌ధ్య‌ థ్రిల్ల‌ర్స్‌, కామెడీ, యాక్ష‌న్ జోన‌ర్స్ సినిమాలు చాలా ఓటీటీలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను అల‌రించగా ఇప్పుడు వాటికి కాస్త భిన్నంగా రెండు ఎమోష‌న‌ల్ జాన‌ర్ సినిమాలు త్వ‌ర‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 800 (800 The Movie) సినిమా డిసెంబర్ 2 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆక్టోబర్6న పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దీంతో మేకర్స్ సినిమాను డిసెంబర్2న ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు.

అదేవిధంగా అవికాఘోర్ నటించిన థ్రిల్లర్ వధువు (Vadhuvu) ఓటీటీలోకి వచ్చేస్తున్నది. ఇటీవల బెంగాలీలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న‘ఇందు’ సిరీస్ ను తెలుగులో రిమేక్ చేయగా అవికా ఘోర్, అలీరెజా, నందు ప్రధాన పాత్రలు పోషించారు..


పెద్ద ఫ్యామిలీల్లో కట్టుబాట్లు, సాంప్రదాయాలు, పద్దతి మాటున జరిగే విషయాలు బయట పడితే జరిగే పరిణామాలు కథా వస్తువుగా ఈ సిరీస్ ను తెరకెక్కించిన ఈ సిరీస్ గానీ 24 నుంచి గానీ డిస్నీ ఫ్ల‌స్‌ హాట్‌స్టార్ (Hotstar) ఓటీటీలో ప్ర‌సారం కానుంది.

Updated Date - 2023-11-14T18:53:54+05:30 IST