OTT: ఓటీటీ ప్రేక్షకులకు బంపర్ బోనాంజా.. ఒక్కరోజే 4 పెద్ద సినిమాలు
ABN , First Publish Date - 2023-11-23T14:28:37+05:30 IST
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు మంచి సినిమా వినోదం అందనుంది. శుక్రవారం ఒక్కరోజునే సౌత్ ఇండియా నుంచి పెద్ద స్టార్లు నటించిన నాలుగైదు పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ఇవన్నీ ప్రతీ ఒక్కరూ మిస్సవకుండా తప్పనిసరిగా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు మంచి సినిమా వినోదం అందనుంది. శుక్రవారం ఒక్కరోజునే సౌత్ ఇండియా నుంచి పెద్ద స్టార్లు నటించిన నాలుగైదు పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ముఖ్యంగా దసరాకు విడుదలైన భగవంత్ కేసరి, దళపతి విజయ్ సినిమాలతో పాటు మోహన్‌లాల్ నటించిన ఓడియన్, ఆర్య మొదటి సారిగా నటించిన వెబ్ సిరీస్ ఆయా ఫ్లాట్‌ఫాంలలో విడుదల కానున్నాయి. ఇవన్నీ ప్రతీ ఒక్కరూ మిస్సవకుండా తప్పనిసరిగా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
మొదటగా బాలకృష్ణ(Nandamuri Balakrishna), కాజల్, శ్రీలీల నటించిన ఈ యాక్షన్, డ్రామా సినిమా భగవంత్ కేసరి (Bhagavanth kesari) దసరాకు థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరుస సక్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని మంచి సందేశం కుటుంబ ప్రేక్షకులకు నచ్చడంతో మంచి కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ దసరా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 24) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
దళపతి విజయ్ (actor vijay), త్రిష జంటగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో(Leo) సినిమా దసరాకు విడుదలై మంచి విజయాన్ని సాధించింది. యాక్షన్,ఆడ్వెంచర్‌గా వచ్చిన ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. తమిళనాట ఇంకా భారీ కలెక్షన్లతో దూసుకెళుతూ రూ.620 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ చిత్రం హెచ్డీ వెర్షన్ పది రోజుల కిందటే అన్‌లైన్‌లోకి వచ్చేయడంతో సినిమాను త్వరగా ఓటీటీకి తీసుకువచ్చారు. శుక్రవారం (నవంబర్ 24) నుంచి నెట్‌ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ కానుంది.
మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా , నిర్మాతగా వ్యవహరించిన మళయాళ చిత్రం ఓడియన్ (Odiyan). 2018లో విడుదలైన ఈ ఫ్యాంటసీ, డ్రామా చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించింది. ప్రకాష్ రాజ్, మంజూ వారిమర్ ప్రధాన పాత్రలు పోషించారు.ఇప్పుడు ఈ చిత్రాన్ని శుక్రవారం (నవంబర్ 24) నుంచి ఈటీవీ విన్ (EtvWin)లో స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నారు.
తమిళ స్టార్ ఆర్య (arya) మొట్టమొదటిసారిగా వెబ్‌సిరీస్‌లలోకి అడుగుపెడుతూ చేసిన సిరీస్ హర్రర్ థ్రిల్లర్ ‘ది విలేజ్’ (The Village). ఇప్పటికే విడుదలైన టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను భయపెట్టింది. ఇప్పుడు ఈ సిరీస్‌ను శుక్రవారం (నవంబర్ 24న) అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ తీసుకు వస్తున్నారు.
ఇక చివరగా బాలయ్య హోష్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ 3 లిమిటెడ్ ఎడిషన్‌లో యానిమల్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన, దర్శుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం (నవంబర్ 24న) ఆహాలో స్ట్రీమింగ్‌కు రానుంది.