12th Fail: ఓటీటీలోకి.. మ‌స్ట్ వాచ్ ఫిలిం! కుటుంబంతో చూడండి.. అస్స‌లు మిస్స‌వొద్దు

ABN , Publish Date - Dec 25 , 2023 | 06:03 PM

మ‌న దేశంలో ప్ర‌తి వారం వంద‌ల సంఖ్య‌ల్లో సినిమాలు విడుద‌ల అవుతుంటాయి.. పోతుంటాయి. అందులో ఒక‌టో రెండో చెప్పుకోద‌గ్గ‌వి, క‌ల‌కాలం నిలిచిపోయేవి, ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌క చూడాల్సినవి అరుదుగా ఉంటుంటాయి. ఆ రెండో కోవ‌కు చెందిందే ఇప్పుడు మ‌నం మాట్లాడుకోబోయే సినిమా 12th ఫెయిల్.

12th Fail: ఓటీటీలోకి.. మ‌స్ట్ వాచ్ ఫిలిం! కుటుంబంతో చూడండి.. అస్స‌లు మిస్స‌వొద్దు
12th fail

మ‌న దేశంలో ప్ర‌తి వారం వంద‌ల సంఖ్య‌ల్లో సినిమాలు విడుద‌ల అవుతుంటాయి.. పోతుంటాయి. అందులో ఒక‌టో రెండో చెప్పుకోద‌గ్గ‌వి, క‌ల‌కాలం నిలిచిపోయేవి, ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌క చూడాల్సినవి అరుదుగా ఉంటుంటాయి. ఆ రెండో కోవ‌కు చెందిందే ఇప్పుడు మ‌నం మాట్లాడుకోబోయే సినిమా 12th ఫెయిల్(12thFail ). బయోగ్రాఫికల్ డ్రామా జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ హిందీ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆక్టోబ‌ర్ 27న, తెలుగులో న‌వంబ‌ర్ 3న విడుద‌ల‌వ‌గా రెండు నెల‌ల త‌ర్వాత‌ ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ద‌మైంది.

1942 ల‌వ్ స్టోరీ, ప‌రిందా వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం, మున్నాబాయ్ ఎంబీబీఎస్‌, పీకే, 3 ఇడియ‌ట్స్‌ వంటి జాతీయ ఉత్త‌మ చిత్రాల‌ను నిర్మించిన విదు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) చాలాకాలం త‌ర్వాత మెగా ఫోన్ చేత‌బ‌ట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డమే కాకుండా నిర్మించడం విశేషం. మనోజ్ కుమార్ శర్మ IPS, శ్రద్ధా జోషి శర్మ IRSలు త‌మ‌ తీవ్రమైన పేదరికాన్ని అధిగమించి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి UPSC ప్రిపరేషన్ కోసం ఢిల్లీకి వ‌చ్చి అక్క‌డ క‌ఠిన పరిస్థితులు ఎదుర్కొని ఏ విధంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్లుగా అయ్యారనే నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా అనురాగ్ పాఠక్ అనే ర‌చ‌యిత రాసిన పుస్తకాన్ని ప్రేర‌ణ‌గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.


manoj-sharma.jpg

12వ త‌ర‌గ‌తి ఫెయిలైన (12th Fail ) మనోజ్ కుమార్ శర్మ అనే విధ్యార్థి పూట గ‌డ‌వ‌డం కోసం ఆటో న‌డుపుతూ ఐపీఎస్ కావాల‌నే త‌న క‌ల‌ను ఏ విధంగా స‌ఫ‌లం చేసుకున్నాడు, అదే స‌మ‌యంలో శ్ర‌ద్ధా జోషితో ప‌రిచ‌యం ఏర్ప‌డి ఇద్ద‌రూ త‌మ ల‌క్ష్యాల‌ను ఎలా చేరుకున్నార‌నే ఇతివృత్తంతో ఆద్యంతం కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఎమోష‌న‌ల్ రైడ్ చేయిస్తూ సినిమా సాగుతుంది. అక్క‌డ‌క్క‌డ మ‌న దేశంలోని విద్యావ్య‌వ‌స్థ తీరును ఎత్తి చూపుతుంది. కోచింగ్ సెంట‌ర్ల వ‌ద్దకు వ‌చ్చే ల‌క్ష‌లాది విద్యార్థులు, నిరుద్యోగుల అవ‌స్థ‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు భావోద్వేగ‌పూరితంగా తెర‌కెక్కించారు.

ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) క‌థానాయ‌కుడిగా టైటిల్ రోల్ పోషించ‌గా, మేధా శంకర్, అనంత్ వి జోషి, అన్షుమాన్ పుష్కర్ మరియు ప్రియాంషు ఛటర్జీ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా దాదాపు రూ.65 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతుంది. అదేవిధంగా IMDbలో 9.2 ర్యాంక్ సాధించిన అతి కొద్ది సినిమాల జాబితాలో ఈ చిత్రం 12th Fail చోటు సంపాదించడం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఈ మూవీ డిసెంబ‌ర్ 29 నుంచి హిందీతో పాటు, తెలుగు భాష‌లోనూ డిస్నీ ఫ్ల‌స్ హాట్ స్టార్ (Disney+ Hotstar)లో అందుబాటులో ఉండ‌నుంది. సో ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని మిస్ అయ్యారో వారు ఇప్పుడు మాత్రం అస‌లు మిస్స‌వ‌కండి. ముఖ్యంగా మీ పిల్ల‌ల‌తో క‌లిసి చూడ‌డం అస‌లు మ‌రువ‌ద్దు.

Updated Date - Dec 25 , 2023 | 06:08 PM