Sridevi: శ్రీదేవిని ఆ నిర్మాత ఏమి చేసాడో తెలిస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-04-12T11:19:18+05:30 IST

శ్రీదేవి హిట్ సినిమాల్లో 'దేవత' సినిమా ఒకటి. అందులో శోభన్ బాబు కథానాయకుడు, జయప్రద ఇంకో కథానాయిక. ఈ సినిమా ప్రముఖ నిర్మాత డ్ రామానాయుడు నిర్మించారు. అయితే ఇందులో బిందెల పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏమి జరిగిందంటే...

Sridevi: శ్రీదేవిని ఆ నిర్మాత ఏమి చేసాడో తెలిస్తే షాక్ అవుతారు

దివంగత అందాల తార శ్రీదేవి (Sridevi) ఇటు దక్షిణాదిలోనూ, అటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ అగ్ర తారగా వెలుగొందింది. కానీ ఆమె ఎక్కువ సినిమాలు తెలుగులోనే చేసింది. శ్రీదేవి ఎన్టీఆర్ (NTR), శ్రీదేవి కృష్ణ (SuperStarKrishna), శ్రీదేవి శోభన్ బాబు (Sobhan Babu), శ్రీదేవి ఎఎన్ఆర్ (ANR), ఇలా అప్పట్లో అగ్రనటులు అందరితో శ్రీదేవి కాంబినేషన్ తో చాలా విజయవంతమైన సినిమాలు వచ్చాయి. వీళ్లందరితో శ్రీదేవి చేస్తోంది అంటే అప్పట్లో అది చాలా క్రేజీ గా ఉండేది. అలాగే అగ్ర నటులతో పాటు శ్రీదేవి కి కూడా వీరాభిమానులు ఉండేవారు. ఈ చిత్ర నిర్మాత రామానాయుడు (D Ramanaidu) కి సినిమా పరిశ్రమలో మంచి సంబంధాలు ఉండేవి. అయన అజాత శత్రువు, పరిశ్రమలో అందరూ ఆయన్ని మూవీ మొఘుల్ అనేవారు, అందరితో కలివిడిగా కూడా ఉండేవారు. అది ఒక నటులే కాదు, నటీమణులు కూడా రామానాయుడు తో చాలా ఆత్మీయంగా ఉండేవారు. ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఒక చిన్న సరదా సంఘటన జరిగింది.

devathafilm.jpg

శ్రీదేవి చేసిన హిట్ సినిమాలలో 'దేవత' (Devatha) సినిమా ఒకటి. ఈరోజుకి ఇందులో పాటలు, మాటలు, సినిమా ఒకటేంటి అన్నీ హిట్. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు నిర్మించగా, సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) దర్శకత్వం వహించారు. శోభన్ బాబు ఇందులో కథానాయకుడు, జయప్రద (Jayaprada) ఇంకో కథానాయకురాలు. ఇది 1982 లో విడుదల అయి ఒక సంచలనం సృష్టించింది. ఇది తరువాత హిందీలో కూడా తీశారు. జితేంద్ర (Jeetendra) హిందీలో కథానాయకుడు, హిందీలో కూడా శ్రేదేవి, జయప్రద కథానాయకురాలుగా నటించారు. అక్కడ కూడా పెద్ద హిట్ ఇది.

ramanaidu.jpg

అయితే ఇందులో బిందెల పాట చాలా ఫేమస్. 'ఎల్లువొచ్చి గోదారమ్మ....' (Elluvachi godaramma song) పాట షూటింగ్ గోదావరి తీరంలో తీశారు. యూనిట్ సభ్యులు అందరూ చేరుకున్నారు, అంతా రెడీ చేసేసారు. దర్శకుడు, శోభన్ బాబు మిగతా యూనిట్ సభ్యులు అందరూ కూడా పాట కోసం నీటి మధ్యలోకి చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్లాలంటే ఒక దగ్గర నీళ్లు పాదాలు తాకుతాయి అందులోంచి ఒక పది అడుగుల వరకు నడవాలి, అలాగే నీళ్లు వున్నాయి కాబట్టి చిన్న బురదలా కూడా ఉందిట. అప్పుడు శ్రీదేవి ఎలా నడవాలి ఆ నీళ్లలోంచి చీర తడిసిపోతుంది అని అలోచించి నిర్మాత రామానాయుడుని అడిగిందిట. అప్పుడు నాయుడు గారు శ్రీదేవిని చిన్నపిల్లని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని గబా గబా నడిచి ఇవతల నుండి అవతలకి తీసుకెళ్లారట. ఈ విషయం అప్పట్లో రామానాయుడు చెపుతూ నవ్వుతూ ఉండేవారు.

devatha.jpg

శ్రీదేవికి తెలీదు నాయుడు గారు ఆలా చేస్తారని, కానీ ఆమె అది చాల సరదాగా తీసుకుంది. రామానాయుడు ఎప్పుడూ కూడా అందరితో ఆత్మీయంగా, సరదాగా ఉండేవాడు. కూతురుని ఎత్తుకొని ఎలా తీసుకు వెళతారో, అలాగే వెంటనే శ్రీదేవిని ఎత్తుకొని తీసుకువెళ్లాడు ఆయన. ఇలాంటివి ఎన్నో శారద సంఘటనలు అప్పట్లో ఉండేవి.

Updated Date - 2023-04-12T11:19:19+05:30 IST