Punnami Nagu: ఈ చిరంజీవి సినిమాకి, కీర్తి సురేష్ కి వున్న సంబంధం తెలిస్తే షాక్ అవుతారు, అదేంటంటే... ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-06-13T18:14:41+05:30 IST

చిరంజీవి నటించిన 'పున్నమినాగు' సినిమాకి 43 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఈ సినిమాకి కీర్తి సురేష్ కి కనెక్షన్ వుంది. అది తెలిస్తే ఒక షాకింగ్ లా ఉంటుంది. అప్పటి సినిమాకి, ఇప్పటి నటి అయిన కీర్తి సురేష్ కి వున్న సంబంధం ఏంటో తెలుసుకోండి.

Punnami Nagu: ఈ చిరంజీవి సినిమాకి, కీర్తి సురేష్ కి వున్న సంబంధం తెలిస్తే షాక్ అవుతారు, అదేంటంటే... ఫోటోస్ వైరల్
Chiranjeevi from the film Punnami Nagu

చిరంజీవి నటించిన 'పున్నమినాగు' #PunnamiNagu సినిమా 43 ఏళ్ళు పూర్తి చేసుకుంది. చిరంజీవి (MegaStarChiranjeevi) కెరీర్ లో పెద్ద గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి నటనకు గాను ఫిలిం ఫేర్ అవార్డు (FilmFareNomination) నామినేషన్ లో మొదటిసారిగా అతని పేరు వచ్చింది. అలాగే ఈ సినిమా ఏవిఎం (AVM) సంస్థ నిర్మించిన సినిమా. ఏవిఎం సంస్థ అనగానే అప్పట్లో ఒక వార్త హల్చల్ చేసేది, ఏంటంటే వాళ్ళు తీసిన సినిమాలలో కచ్చితంగా పాములు ఉంటాయి అని. అలాగే ఈ 'పున్నమినాగు' సినిమా కూడా ఇంచుమించు అలాంటిదే.

chiranjeevikeerthysuresh.jpg

చిరంజీవి ఇందులో నాగులు గా అద్భుతమైన నటన కనపరిచాడు. ఈ సినిమాలో అతని తండ్రి అతనికి చిన్నప్పటి నుంచి ఆహారంలో విషం కలిపి ఇచ్చేవాడు, దానివల్ల అతను పాము కాటు వేసిన మరణించడు. కానీ ప్రతి పౌర్ణమికి నాగులు నాగుపాములా ప్రవర్తించేవాడు, ఆ సమయంలో ఒక అమ్మాయి కోసం చూసేవాడు. ఆ సమయంలో ఏ అమ్మాయిని కలిసినా, ఆ అమ్మాయి చనిపోతూ ఉండేది. వూర్లో రాజు అనే అతను అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు అన్న విషయం మీద దృష్టి పెడతాడు. పాము కాటు కనపడటం లేదు, కానీ విషం వలన ఈ అమ్మాయిలు చనిపోతున్నారు అని నాగులు మీద నిఘావేసి అతన్ని పట్టుకుంటాడు. అప్పుడు తెలుస్తుంది నాగులుకి తన వొంట్లో విషం వున్న సంగతి. అతని తండ్రి చనిపోతూ నాగులుకి విషం పెట్టిన సంగతి చెప్పేస్తాడు. రాజు వూరు వదిలి వెళ్ళిపోమంటాడు నాగులుని, కానీ చివరికి నాగులు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సినిమాకి రాజశేఖర్ (Rajasekhar) దర్శకత్వం చేశారు. అతను అప్పట్లో రజినీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (KamalHaasan) సినిమాలు ఎక్కువ దర్శకత్వం చేస్తుండేవారు. ఈ సినిమాకి కథ రామనారాయణ (Ramanaryana) ఇచ్చారు. అతను అప్పట్లో జంతువులతో ఎక్కువగా కథలు రాస్తుండే వారు, అలాగే ఏవిఎం (AVM) సంస్థ కి కి ఎక్కువ కథలు రాశారు. ఈ 'పున్నమినాగు' సినిమాలో పాటలు అప్పట్లో పెద్ద సంచలనం. ఈ సినిమా చిరంజీవి కెరీర్ మరో మెట్టు ఎక్కడానికి ఉపయోగపడింది.

chiranjeevi-menaka.jpg

అయితే ఇంతకీ ఈ 'పున్నమినాగు' సినిమాకి కీర్తి సురేష్ (KeerthySuresh) కి వున్నా సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా మేనక (Menaka) నటించింది. ఆమె ఎవరో కాదు, కీర్తి సురేష్ తల్లి. మేనకా కి మొదటి తెలుగు సినిమా ఈ 'పున్నమినాగు'. కీర్తి సురేష్ తల్లి అప్పట్లో మలయాళం నటిగా చాలా పేరున్న నటి. ఆమె మలయాళం లో చాలా సినిమాలు చేసింది, ఆ తరువాత తమిళం సినిమాలు కూడా చేసింది, కానీ తెలుగు సినిమాలు రెండు మాత్రమే చేసింది, అందులో మొదటిది ఈ 'పున్నమినాగు' లో చిరంజీవి పక్కన చేసినదే. ఇప్పుడు ఆ మేనక కూతురు కీర్తి సురేష్, చిరంజీవి, మెహెర్ రమేష్ (MeherRamesh) కాంబినేషన్ లో వస్తున్న 'బోళా శంకర్' (BholaaShankar) లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. ఇందులో తమన్నా భాటియా (TamannahBhatia) కథానాయిక. ఇప్పుడు 'పున్నమినాగు' చిరంజీవి మేనక, 'భోళా శంకర్' చిరంజీవి కీర్తి సురేష్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-06-13T18:14:41+05:30 IST