Pic Talk: రారా కృష్ణయ్యా.. రారా కృష్ణయ్యా..
ABN , First Publish Date - 2023-05-15T15:46:38+05:30 IST
బాలీవుడ్, కోలీవుడ్ నటుల ప్రభావం తన మీద ఏ మాత్రం పడకుండా ఎన్.టి.రామారావు తనదైన శైలిలో అద్భుతంగా నటించారీ చిత్రంలో. సిపాయి రాజు పాత్రకు నందమూరి తారక రామారావు..
ఎన్.టి.ఆర్ (NTR), జమున (Jamuna) జంటగా నటించిన ‘రాము’ (Ramu) (04-05-1968) చిత్రంలోనిది ఈ స్టిల్. ప్రఖ్యాత హిందీ గాయకుడు కిశోర్‌కుమార్ నిర్మించిన ‘దూర్ గగన్ కీ చాహు మే’ (Door Gagan Ki Chhaon Mein) చిత్రం హక్కులు కొని.. ఏ.వి.యం. వారు మాస్టర్ రాజ్‌కుమార్ (Master Rajkumar), జెమిని గణేశన్, కె.ఆర్. విజయ ప్రధాన పాత్రలలో ‘రాము’ (1966) తమిళ చిత్రాన్ని తీశారు. అది ఘనవిజయం సాధించింది. ఇదే చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో తీశారు. మాస్టర్ రాజ్‌కుమార్ తమిళ, తెలుగు రెండింటిలోనూ ఒకే పాత్ర పోషించారు.
కిశోర్‌కుమార్, జెమిని గణేశన్ నటుల ప్రభావం తన మీద ఏ మాత్రం పడకుండా ఎన్.టి.రామారావు (NT Ramarao) తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. సిపాయి రాజు పాత్రకు ఎన్.టి.ఆర్. పరిపూర్ణత్వాన్ని చేకూర్చారు. భార్య (పుష్పలత) మరణించినప్పటి నుంచి రాజు పడే మానసిక బాధను ఆయన కరుణరసభరితంగా వ్యక్తం చేసిన తీరు అనుపమానం. కుమారుడు మాట్లాడలేడని తెలిసినప్పుడు తండ్రిగా కుమిలిన తీరు, ఆశ్రయమిచ్చిన లక్ష్మి అనే యువతి తనను ప్రేమిస్తోందని తెలిసి, ఆమెకు దూరంగా ఉండగల నిగ్రహం.. తెరపై ఎన్.టి.ఆర్. గొప్పగా ఆవిష్కరించారు.
స్టంట్ మాస్టర్ శ్యాంసుందర్ రూపొందించిన పులితో పోరాటం, రంగన్న (రాజనాల)తో కొరడా, కర్ర, కాగడాలతో ఫైట్‌లలో చాలా సహజంగా నటించారు. ఈ చిత్రంలోని ‘పచ్చని చెట్టు ఒకటి’ (Pachani Chettu Okati), ‘మంటలు రేపే నెలరాజా’, ‘రారా కృష్ణయ్యా’ (Ra Ra Krishnayya) పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ఇప్పటికే ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి.
- డా. కంపల్లె రవిచంద్రన్, 98487 20478
ఇవి కూడా చదవండి:
************************************************
*Ram Charan: ముంబైలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..
*Krithi Shetty: కాబోయేవాడు కాస్త బొద్దుగా ఉండాలి..
*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..
*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..
*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ