Chandra Mohan: కమల్ హాసన్ కి తెలుగులో సరిసమానమైన నటుడు చంద్రమోహన్

ABN , First Publish Date - 2023-11-12T19:48:23+05:30 IST

చంద్రమోహన్ తన మొదటి సినిమా 'రంగులరాట్నం' లో చేసిన నటనకు ఎన్నో ప్రసంశలు అందుకున్నారు. ఆ తరువాత తనదయిన శైలిలో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అద్భుత నటుడు చంద్రమోహన్. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అయితే చంద్రమోహన్ కి పాటలు పాడటం అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పారు ఒక సందర్భంలో.

Chandra Mohan: కమల్ హాసన్ కి తెలుగులో సరిసమానమైన నటుడు చంద్రమోహన్
Chandra Mohan and Kamal Haasan

నటుడు చంద్రమోహన్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SPBalasubramanyam), కళా తపస్వి కె విశ్వనాధ్ (KViswanath) అందరూ అన్నదమ్ములు వరుస అవుతారని, దగ్గర బంధుత్వం ఉందని అందరికీ తెలిసిన విషయమే. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) కూడా స్వయానా చంద్రమోహన్ కి మేనల్లుడు అవుతారు, అతనే ఇప్పుడు చంద్రమోహన్ అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. చంద్రమోహన్ సుమారు 900 కి పైగా సినిమాలు చేశారు, అద్భుతమైన నటుడు అనిపించుకున్నారు. (Chandra Mohan is paased away on Saturday morning)

కథానాయకుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించి.. కథానాయకుడిగా, విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా, అనేకరకాలైన వైవిధ్యమున్న ఎన్నో పాత్రల్లో చంద్రమోహన్ మెప్పించారు. ఎటువంటి పాత్ర అయినా అది వినోదాత్మకం అయినా, సీరియస్ పాత్ర అయినా తన నటనా కౌశలంతో మెప్పించే నటుడు చంద్రమోహన్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత బాగా నటించే నటుల్లో చంద్రమోహన్ ఒకరుగా చెప్పొచ్చు. ఒక సందర్భంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం అయితే, "కమల్ హాసన్ కి (KamalHaasan) ఏమాత్రం తీసిపోని ఆర్టిస్టు తెలుగులో ఉన్నాడంటే అది ఒక్క చంద్రమోహనే" అని చెప్పారు కూడా.

chandramohanfuneralisonmond.jpg

"నేను పాటలు పాడిన నచ్చిన అతి కొద్దిమంది నటుల్లో చంద్రమోహన్ ఒకడు. వాడు అద్భుతమైన నటుడు, ఎటువంటి భావాన్ని అయినా తెర మీద చూపించగల గొప్ప నటుడు. నా ఆల్ టైం ఫేవరెట్ నటుడు చంద్రమోహన్" అని చెప్పుకున్నారు బాలు ఒక సందర్భంలో. చంద్రమోహన్ కి పాటలు పాడటం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడినని చెప్పుకున్నారు బాలు. అంతే కాదు దర్శకుడు కె విశ్వనాధ్ కూడా చంద్రమోహన్ ని ఒక గొప్ప నటుడిగా అభివర్ణించారని బాలు చెప్పారు ఆ సందర్భంలో. నిజంగా చంద్రమోహన్ అంత గొప్ప నటుడనే విషయంలో ఎట్టి సందేహం లేదు. చంద్ర మోహన్ అంత్యక్రియలు సోమవారం ఉదయం పంజాగుట్ట లోని స్మశానవాటికలో జరుగుతాయి. (Chandra Mohan funeral is going to take place on Monday at Punjagutta burial ground)

Updated Date - 2023-11-12T20:59:05+05:30 IST