అక్కినేని X విశ్వనాథ్
ABN , First Publish Date - 2023-02-04T04:40:07+05:30 IST
అక్కినేని, విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా. ‘సూత్రధారులు’ . ఈ చిత్రం షూటింగ్ అన్నవరం కొండమీద జరిగింది.

అక్కినేని, విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా. ‘సూత్రధారులు’ . ఈ చిత్రం షూటింగ్ అన్నవరం కొండమీద జరిగింది. సాయంత్రం ఐదున్నరకి షూటింగ్ ఉందని చెప్పడంతో నాగేశ్వరరావు సమయానికి వచ్చారు. కానీ విశ్వనాథ్ ఓ గంట ఆలస్యంగా వచ్చారు .దీనితో అక్కినేని ఆగ్రహించి ‘ మీకంటే వయసులో పెద్ద వాడినైనా అనుకున్న సమయానికి వచ్చాను. మీరు చెప్పిన టైమ్ ఏంటి, వచ్చిన టైమ్ ఏంటి?’ అని నిలదీశారు. ఆయన అడిగిన తీరుకు విశ్వనాథ్‌కు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇదంతా చూసి నిర్మాతలు సుధాకర్, కరుణాకర్ కంగారు పడ్డారు. పత్రికా విలేకర్లు కూడా వచ్చారు. షూటింగ్ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ఇంతలో నటుడు జిత్ మోహన్ మిత్రా అక్కినేని దగ్గరకు ‘ఆయన భక్తుడని మీకు తెలుసుకదా. పూజ వల్ల లేట్ అయింది’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆయన వంక కోపం చూసి, ‘మీవోడే కదా వెళి ్లచెప్పు’ అన్నారు అక్కినేని. . తర్వాత విశ్వనాథ్ వద్దకు వెళ్లి ఆయనకూ నచ్చజెప్పారు మిత్రా. ఆ తర్వాత ఇద్దరిని దేవస్థానం ఈవో గదిలో కూర్చోపెట్టి తలుపు వేసి వచ్చేశారు మిత్ర కాసేపటికి ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. ఆ తర్వాత షూటింగ్ మొదలైంది