Pragnan: ఓటీటీలో వచ్చిన సినిమాతో హాట్ టాపిక్‌గా కరీంనగర్ కుర్రాడు

ABN , First Publish Date - 2023-10-13T19:31:50+05:30 IST

ఓటీటీలో ఇటీవల విడుదలైన ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’ హిందీ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో కరీంనగర్ కుర్రాడు ప్రజ్ఞన్ విలన్‌గా నటించాడు. ఇప్పుడతనికి ఓ తెలుగు సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వచ్చినట్లుగా తాజాగా అతనే చెప్పుకొచ్చాడు.

Pragnan: ఓటీటీలో వచ్చిన సినిమాతో హాట్ టాపిక్‌గా కరీంనగర్ కుర్రాడు
Pragnan Actor

ఓటీటీలో ఇటీవల విడుదలైన ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’ (Kaala Barbarian Chapter 1) హిందీ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో కరీంనగర్ కుర్రాడు ప్రజ్ఞన్ విలన్‌గా నటించాడు. ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’లో సైకో పాతలో ప్రజ్ఞన్ నటనకు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఓటీటీలో వచ్చిన ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్.. అలాగే ప్రజ్ఞన్ (Pragnan) నటనకు వస్తున్న ప్రశంసలతో ఒక్కసారిగా ఈ కరీంనగర్ కుర్రాడి పేరు వైరల్ అవుతోంది. ఇప్పుడతనికి ఓ తెలుగు సినిమాలో విలన్ పాత్రలో నటించే ఛాన్స్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.

ఈ సందర్బంగా ప్రజ్ఞన్ మాట్లాడుతూ ‘‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1 (Kaala Barbarian Chapter 1).. ఈ సినిమాలో చయనిక చౌదరితో కలిసి నేను నటించిన సన్నివేశాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన పలువురు దర్శకులు ఫోన్ చేసి ప్రశంసించారు. అది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాకుండా నేను కొంతమంది దర్శకులకు ఈ సినిమా చూపించినప్పుడు.. చూసిన వెంటనే తెలుగు సినిమాలో ఒక ప్రముఖ హీరో సరసన అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీని (Srini)గారికి ధన్యవాదాలు.


Pragnan-2.jpg

మల్టీపుల్ డిజార్డర్ క్యారెక్టర్‌కి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఒక మంచి నటుడికి ఇంతకంటే కావలసిందేముంది. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూ‌ట్‌లో యాక్టింగ్ కోర్సు ముగించుకోగానే ఈ అవకాశం వచ్చింది. నా తొలి చిత్రానికే ఇంతటి పేరు రావడం నాకు చాలా ఆనందంగా వుందని అన్నా రు. కాగా.. జింటో చాకో శామ్యూల్ (Jinto Chacko Samuel) దర్శకత్వం వహించిన కాలా బార్బేరియన్ చాప్టర్ 1 చిత్రంలో వరుణ్ సింగ్ రాజ్‌పుత్, స్తుతి త్రివేది జంటగా నటించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Animal: ఆ హీరోయిన్ సేఫయింది.. పాపం రష్మికా బుక్కయింది

*************************************

*Tiger Nageswara Rao Single: నా గుండెపైన నీ వేలిముద్ర.. దాచేది ఎట్టా ఓ రామచంద్రా?

***********************************

*Jr NTR: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే దానికి ఇదేనా క్లారిటీ!?

************************************

*Vishal: గ్రామస్తుల దాహార్తిని తీర్చిన హీరో విశాల్‌

*************************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ టీజర్ కూడా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

***********************************

Updated Date - 2023-10-13T20:52:49+05:30 IST