Vontari Gulabi: గణేష్ మండపాలలో సందడి చేసిన సీరియల్ స్టార్స్

ABN , First Publish Date - 2023-09-21T20:56:14+05:30 IST

హైదరాబాద్ మహానగరంలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈసారి మరో ప్రత్యేకత చోటు చేసుకోనుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే సీరియల్ స్టార్స్ ఈసారి గణేష్ మండపాలను సందర్శిస్తూ.. వారి సీరియల్‌ను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ‘ఒంటరి గులాబి’ స్టార్స్ హైదరాబాద్ గణేష్ మండపాలలో సందడి చేశారు.

Vontari Gulabi: గణేష్ మండపాలలో సందడి చేసిన సీరియల్ స్టార్స్
Vontari Gulabi Serial Stars

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈసారి మరో ప్రత్యేకత చోటు చేసుకోనుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే సీరియల్ స్టార్స్ ఈసారి గణేష్ మండపాలను (Ganesh Mandapas) సందర్శిస్తూ.. వారి సీరియల్‌ను ప్రమోట్ చేసుకుంటున్నారు. జెమిని ఛానల్‌లో ప్రసారమయ్యే ‘ఒంటరి గులాబి’ సీరియల్ స్టార్స్ కొందరు హైదరాబాద్‌లోని గణేష్ మండపాలను సందర్శిస్తూ సందడి చేస్తున్నారు.


Vontari-Gulabi.jpg

హైదరాబాద్ నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని.. అక్కడ నిర్వాహకులను.. భక్తులను స్వయంగా కలిసి వారితో ముచ్చటించనున్నారు. ఇందులో భాగంగా దిల్‍సుఖ్‍నగర్ వివేకానంద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మరియు సరూర్ నగర్ నవీజీవన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలని.. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సీరియల్ ‘ఒంటరి గులాబి’ (Vontari Gulabi)లో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న బాలు (రాహుల్ రవి), రోజా (సుప్రిత) నేరుగా సందర్శించి సందడి చేశారు. మరికొన్ని మండపాలను వీరు సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Naveen Polishetty: సీన్ పేపర్‌లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు

******************************

*Natti Kumar: అసెంబ్లీలో బాలకృష్ణపై అంబటి వ్యాఖ్యలను ఖండిస్తున్నా..

********************************

*Anasuya: ‘పెదకాపు 1’‌లో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పా..

*******************************

*Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..

******************************

Updated Date - 2023-09-21T20:56:14+05:30 IST