Nandyala Srinu: తండ్రికి భారం.. పిల్లల భవిష్యత్‌కు ఆటంకం కాకూడదని.. ఈ రంగస్థల నటుడు ఏం చేశాడంటే?
ABN , First Publish Date - 2023-06-24T21:39:34+05:30 IST
తన తండ్రికి భారం కాకూడదని కొన్నాళ్ళు... తన పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కాకూడదని కొన్నాళ్ళు.. ఈ నటుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నటుడు ఎవరో కాదు.. రంగస్థల నటుడు వణుకూరు శ్రీనివాస్ రెడ్డి అలియాస్ నంద్యాల శ్రీను. ప్రస్తుతం ఆయన సినిమాలలో నటించి, గొప్ప నటుడిని కావాలని తన తండ్రి కన్న కలను నిజం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తన తండ్రికి భారం కాకూడదని కొన్నాళ్ళు... తన పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కాకూడదని కొన్నాళ్ళు.. ఈ నటుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నటుడు ఎవరో కాదు.. రంగస్థల నటుడు (Stage Actor) వణుకూరు శ్రీనివాస్ రెడ్డి అలియాస్ నంద్యాల శ్రీను. తండ్రి, పిల్లల గురించి ఆలోచించి.. తన నటనాసక్తికి తనకు తానే కొన్నాళ్ల పాటు అడ్డుకట్ట వేసుకున్న ఈ భూమి పుత్రుడు.. ఇప్పుడు నట వ్యవసాయం చేసేందుకు మరోసారి నడుం కడుతున్నాడు. తన పిల్లలిద్దరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దడంతోపాటు... పెళ్ళిళ్ళు కూడా చేసి, నటుడిగా తన చిరకాల వాంఛ తీర్చుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తాజాగా నంధ్యాల శ్రీను (Nandyala Srinu) చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా నంద్యాల శ్రీను మాట్లాడుతూ.. కుటుంబ బరువు బాధ్యతలు సక్రమంగా పోషిస్తూనే, నాటకాల కోసం తిరుగుతుండే నన్ను చూసి మా నాన్న... నా ముందు నన్ను తిట్టినా... తన స్నేహితుల వద్ద మురిసిపోయేవాడు. నటుడిగా నేను మరింత రాణించాలని కోరుకునేవాడు. మా నాన్న కాలం చేసేనాటికి యుక్త వయస్సులో ఉన్న మా అబ్బాయికి కూడా నా తపన తెలుసు. అందుకే ఇప్పుడు మా అబ్బాయితోపాటు.. మా అమ్మాయి, కోడలు, అల్లుడు ప్రోత్సాహంతో... నా నాటకానుభవాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. నటుడిగా నన్ను ఉన్నత స్థాయిలో చూడాలన్న మా నాన్న కోరిక తీర్చడం కోసం.. సినిమా రంగంలో నా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నానని చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. తన భార్య సపోర్ట్ లేకపోతే తాను లేనని అన్నారు. పిల్లలు ప్రయోజకులు కావడంలో, బంధువర్గంలో తమకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవడంలో తన జీవన సహచరి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని తెలిపారు. ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మాత్రమే కాదు.. కర్షకులు కూడా సినిమా రంగంలో దర్జాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయవచ్చని నిరూపించేందుకు తహతహలాడుతున్నానని శ్రీను వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Sobhita Dhulipala: కాబోయేవాడు అలా ఉండాలంటూనే.. చైతూ లక్షణాలకు మ్యాచ్ చేస్తోంది
**************************************
*Bholaa Shankar Teaser Talk: మెగాస్టార్.. మాస్ అరాచకం!
**************************************
*Anand Sai and Vasuki: ‘తొలిప్రేమ’ రీ రిలీజ్‌పై ఈ దంపతులు ఏమన్నారంటే..
**************************************
*Megastar Chiranjeevi: మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్
**************************************
*KP Chowdary: ‘కబాలి’ నిర్మాత కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. చిక్కుల్లో అషు రెడ్డి
**************************************
*BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..
**************************************