HBD Mohanbabu: ఆయన రూటే సపరేటు.. భక్తవత్సలం నాయుడు నుంచి పద్మశ్రీ వరకు..

ABN , First Publish Date - 2023-03-19T12:19:05+05:30 IST

మహానుభావుల విజయగాథలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఓ సామాన్య వ్య‌క్తి నుంచి అసామాన్య శక్తిగా ఎదిగి తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నిత్య నూతన కళాకారుడు.

HBD Mohanbabu: ఆయన రూటే సపరేటు.. భక్తవత్సలం నాయుడు నుంచి పద్మశ్రీ వరకు..
Mohanbabu

సాధారణ వ్యక్తుల విజయగాథలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఓ సామాన్య వ్య‌క్తి నుంచి అసామాన్య శక్తిగా ఎదిగి తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నిత్య నూతన కళాకారుడు. కళమాతల్లి ముద్దుబిడ్డ.. సినిమా ప్రేక్షకుల ‘పెద‌రాయుడు’ (Pedarayudu)నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్, హీరో, క్యారెక్టర్ నటుడు మంచు భక్తవత్సలం నాయుడు ఆయ‌నే మంచు మోహన్ బాబు (Manchu Mohanbabu). నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోట కట్టుకున్న డా. మంచు.మోహన్ బాబు పుట్టిన రోజు నేడు.

చిత్తూరుజిల్లా మోదుగులపాలెం గ్రామంలో 1952 మార్చి 19న జన్మించిన‌ మోహన్‌ బాబు ప్రాథమిక విద్య యర్పేడు, తిరుపతిలలో సాగింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు మోహన్ బాబుకు చిన్నప్పటి నుంచి నాటకాల అంటే ప్రత్యేక అభిమానం. అలా నాటకలపై శ్రద్ధాసక్తులు కనబరుస్తూ ఆయన పెరిగారు. సినిమాల్లో నటించాలనే ఆలోచన, గొప్పవాన్ని కావాలనే కల ఆయన్ని ఎన్నో నిదురలేని రాత్రులని గడిపేలా చేసింది. తన కల నేరవేర్చుకోవటానికి మ‌ద్రాసుకు వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు వై.యం.సి.ఏ. కాలేజీలో ఫిజికల్ ట్రైనీగా పనిచేశారు. కానీ నటుడు అవ్వాలనే కోరిక ఆయన్ని నిలకడగా ఉండనివ్వలేదు. అవకాశాల కోసం ఎండ, వాన, ఆకలి దప్పికలు లెక్కచేయక అహర్నిశలు శ్రమించారు. అలా ఆయన దర్శకుడు లక్ష్మి దీపక్ దగ్గర కొన్ని రోజులు పనిచేశారు. 1975లో దాసరి నారాయణరావు గారు కొత్త నటీనటులతో నిర్మించాల అనుకుంటున్న ‘స్వర్గం-నరకం’ చిత్రం కోసం జరిగిన ఆడిషన్‌లో భక్తవత్సలం దాసరి దృష్టిని ఆకర్షించి నటునిగా తొలి ఆవకాశం సంపాదించారు. దాసరి గారే భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా వెండితెరకు పరిచయం చేశారు. (Manchu Mohanbabu Birthday)

అలా.. ‘స్వర్గం నరకం’ చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు 573 చిత్రాలకు పైగా నటించి నవరసాలు పండించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అందులో అల్లుడుగారు, అసెంబ్లీ రౌడి, రౌడీ గారి పెళ్లాం మోహన్ బాబుని హీరోగా నిలబెట్టాయి. ఆ తరవాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా ‘కలెక్షన్ కింగ్’ గా పేరు తెచ్చుకున్నారు. అనంతరం వచ్చిన ‘పెదరాయుడు’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక శ్రీ రాములయ్య , అడవిలో అన్నతో మోహన్ బాబులో మరో నటుడిని ప్రేక్షకులకు చూశారు. వీటితో పాటు మొత్తం 216 చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు. (Manchu Mohanbabu Birthday)

అలాగే 1983లో శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్ స్థాపించి నిర్మాతగా మారి 72కి పైగా చిత్రాలు నిర్మించి, సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. సినీరంగానికే పరిమితం కాకుండా 1992లో విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మోహన్ బాబు తన ఇంట్లో పిల్లలనే కాదు బడిలో పిల్లలను సైతం క్రమశిక్షణగా పెరిగేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్,, అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందారు. ఆయనకు ‘నటప్రపూర్ణ’, ‘డైలాగ్ కింగ్’, ‘కల్లెక్షన్ కింగ్’ అనే బిరుదులే కాకుండా ‘యాక్టర్ ఆఫ్ ది మిలీనియం’ లాంటి పలు బిరుదులు ఉన్నాయి. వీటితోపాటు తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇచ్చింది. ఇవేకాకుండా 'నటవాచస్పతి' 2015లో 'స్వర్ణకనకం' 2016లో నవరస నటరత్నం అవార్డులు పొందారు. 1995లో ఎన్టీఆర్ ప్రోద్బలంతో 2001 వ‌ర‌కు రాజ్యసభ ఎంపీగా గెలిచారు. (Manchu Mohanbabu Birthday)

ఆయన మాత్రమే కాదు ఆయన పిల్లలు మంచు విష్ణు బాబు, లక్ష్మీప్రసన్న, మనోజ్ సైతం క్రమశిక్షణగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ప్రేమను పొందుతున్నారు. ఇక మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసి పలు కమర్షియల్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకవైపు సినిమాలు మరో వైపు విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటూ గత సంవత్సరం మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా గెలిసి సినిమా ఆర్టిస్టులకు తన వంతు సేవ చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి సైతం తండ్రి మోహన్ బాబు బాటలోనే నడుస్తూ సినిమాలు మాత్రమే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. గత సంవత్సరం యాదగిరిగుట్ట పరిధిలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా దత్తత తీసుకొని తండ్రి పెంపకం అంటే ఎలా ఉంటుందో నిరూపించారు. అలాగే సినిమాల్లో రాణిస్తూనే... సమాజంలో అడబిడ్డలపై ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా వారి కుటుంబం తరుపున నిలబడి న్యాయం కోసం నిలబడే మరో డైనమిక్ మనిషి మంచు మనోజ్.. ఇలా మంచు మోహన్ బాబు ఆయనే కాకుండా కుటుంబం అంత సమాజ స్పృహ ఉన్నవారే కావడం గొప్పవిషయం. (Manchu Mohanbabu Birthday)

కళను కళాకారులను అమితంగా అభిమానించే మోహన్‌బాబు సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మించ‌డంతో పాటు ఆయ‌నే హీరోగా, ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తూ పలు సినిమాల్లో న‌టిస్తున్నారు. వెండితెరపై అదే ఉత్సాహంతో ఇలాగే మ‌రిన్ని చిత్రాల్లో న‌టిస్తూ మ‌న‌ల్ని ఎప్పుడు అలరించాలని కోరుకుంటూ.. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. (Manchu Mohanbabu Birthday)

ఇవి కూడా చదవండి:

Allu Arjun: తన హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-19T12:46:31+05:30 IST