Youtube: సింగర్ హత్యకు గురైన పది నెలలకు రిలీజైన పాట.. రికార్డులు బ్రేక్
ABN , First Publish Date - 2023-04-07T14:40:23+05:30 IST
గతేడాది మేలో ప్రముఖ పంజాబీ ర్యాపర్, సింగర్ సిద్ధూ మూస్ వాలా (Sidhu Moose Wala)ని కొందరు కొందరు దుండగులు హత్య చేశారు.
గతేడాది మేలో ప్రముఖ పంజాబీ ర్యాపర్, సింగర్ సిద్ధూ మూస్ వాలా (Sidhu Moose Wala)ని కొందరు కొందరు దుండగులు హత్య చేశారు. దానికి సంబంధించిన వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించిన గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడింది. అయితే.. సిద్ధు మరణ వార్త తెలిసి ఆయన అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా జనాలు బిత్తరపోయారు. మరణించే సమయానికి సిద్దూ వయసు కేవలం 28 మాత్రం. దాంతో ఆయన ఫ్యాన్స్ అయితే ఆ మృతిని జీర్ణించుకోలేకపోయారు. అయితే.. సింగర్‌గా మాత్రం ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడని ఆ సాంగ్ నిరూపించింది.
సిద్దు మరణించిన దాదాపు పది నెలల తర్వాత కూడా ఆయన తన అభిమానులను తన పాటతో అలరించారు. ఈ గాయకుడు చనిపోకముందే పలు పాటలను పాడి రిలీజ్ సిద్ధం చేశారు. అయితే.. ఆయన మరణంతో అవన్నీ విడుదల కాకుండా ఆగిపోయాయి. తాజాగా అందులో ఓ సాంగ్‌ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. అది ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ రికార్డుల బ్రేక్ చేస్తోంది. సిద్దూ మూస్ వాలా అధికారిక యూట్యూబ్‌లో ‘మేరా నా’ (Mera Na) పేరుతో విడుదలైన ఈ పాట గంటలోపే మిలియన్ వ్యూస్ రాబట్టి అభిమానుల్లో రికార్డు సృష్టించింది. (1 Million Likes in 3 Hours)
Also Read:
Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..
ఈ వీడియో సాంగ్‌కి నవకరణ్ బ్రార్ దర్శకత్వం వహిచాడు. ఈ వీడియోలో వీఎఫ్‌ఎక్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి దివంగత సిద్ధూ గోడ మీద ఉండే చిత్రాలు, పెయింటింగ్‌లు పాట పాడుతున్నట్లు చిత్రీకరించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సిద్దూ వాయిస్ వస్తోంది. కాగా.. ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన 40 నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్‌ని దాటేసింది. అలాగే.. రెండు గంటల్లో మూడు మిలియన్లపైగా వ్యూస్‌ని సాధించి, ఒక మిలియన్ లైక్‌లను సాధించడం విశేషం. అత్యంత వేగంగా మిలియన్ లైక్‌లను సాధించిన భారతీయ పాటగా ఈ సాంగ్ నిలిచింది. అంతేకాకుండా పలువురు సిద్ధూ అభిమానుల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘కేవలం ఒక గంటలో 1 మిలియన్ లైక్‌లు. మరణం కూడా ఆయన్ని ఆపలేకపోతోంది’.. ‘సాంగ్ చాలా బావుంది. లెజెండ్స్ ఎప్పటి చనిపోరు. అభిమానుల మనస్సులో బతికే ఉంటారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సిద్ధు మూస్ వాలా అసలు పేరు శుభదీప్ సింగ్ సిద్ధూ. ఆయనకి పంజాబీ ర్యాపర్, గాయకుడిగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. (Sidhu Moose Wala new song creates records)
ఇవి కూడా చదవండి:
War 2: బాలీవుడ్ మూవీలో విలన్‌గా ఎన్టీఆర్!?
Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..
Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..