Shravan Reddy: ‘డర్టీ హరి’, ‘మంగళవారం’.. రూట్ మ్యాప్ రెడీ..
ABN , First Publish Date - 2023-07-10T22:58:24+05:30 IST
ఎమ్.ఎస్.రాజు ‘డర్టీ హరి’ (Dirty Hari) చిత్రంతో.. ఎవరీ శ్రవణ్ రెడ్డి? అని ఆరాలు తీసే రేంజ్‌లో పెర్ఫామ్ చేసిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మంగళవారం’తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే రచ్చ గెలిచిన ఈ హైదరాబాద్ పోరడు.. ఇప్పుడు ఇంట గెలిచేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
అతని డ్రీమ్ క్రికెటర్ కావాలని. కానీ కొన్ని కారణాంతరాల వల్ల ఆ క్రీడలో తన కల సాకారం అయ్యే అవకాశాలు లేకపోవడంతో.. ఇప్పుడతను సినిమా రంగంపై దృష్టి పెట్టాడు. అయితే సినిమా రంగంలో రాజ్యమేలుతున్న వారసత్వాన్ని ఢీ కొట్టే సాహసం చేయడం ఇష్టం లేక.. ‘చలో ముంబై’ అంటూ టీవీ రంగంపై గురి పెట్టాడు. తన హైదరాబాద్ హిందీ భాషకు మరింతగా మెరుగులు దిద్దుకుని... తనను తాను సాన బెట్టుకున్నాడు. హిందీ టెలివిజన్ రంగంలో తన పేరు చిన్నగా మారు మ్రోగేలా చేసుకున్నాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి.. ముంబైలో తన ఉనికిని గట్టిగా నిరూపించుకుని.. తెలుగు నిర్మాతల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ఆ తెలుగు కుర్రాడి పేరు శ్రవణ్ రెడ్డి (Shravan Reddy).
‘దోస్తీ యారియా మన్మర్జియాన్’, ‘థింకిస్తాన్ సీజన్ 1 అండ్ 2’ వంటి వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న శ్రవణ్ రెడ్డి.. ఇకపై తెలుగు సినిమాలపై ఎక్కువ దృష్టి పెడతానంటున్నాడు. ఎమ్.ఎస్.రాజు ‘డర్టీ హరి’ (Dirty Hari) చిత్రంతో.. ఎవరీ శ్రవణ్ రెడ్డి? అని ఆరాలు తీసే రేంజ్‌లో పెర్ఫామ్ చేసిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మంగళవారం’ (Mangalavaaram)తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి, ‘మిస్టర్ హైదరాబాద్’ టైటిల్ విన్నర్ అయిన శ్రవణ్ రెడ్డి... పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నట్లుగా తెలిపారు. పలు యాడ్ ఫిల్మ్స్‌లోనూ నటించి... జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగి, తెలుగుతో పాటు... హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టు కలిగిన శ్రవణ్... పేరు పెట్టని మరో రెండు తెలుగు చిత్రాలకు సైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. సినిమా మేకింగ్‌కు సంబంధించిన మొత్తం ప్రాసెస్ తెలుసుకోవడం కోసం పలు హిందీ చిత్రాలకు దర్శకత్వ శాఖలోనూ పని చేసి అనుభవం గడించిన ఈ పక్కా ‘హైదరాబాద్ కుర్రాడు’.. ఇక ఇంట కూడా గెలిచేందుకు తగిన రూట్ మ్యాప్‌ని సిద్ధం చేసుకున్నానని అంటున్నాడు. చూద్దాం.. ఆయన రూట్ మ్యాప్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో..
ఇవి కూడా చదవండి:
**************************************
*Viraj Ashwin: ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందంటోన్న యంగ్ హీరో
**************************************
*Brahmaji: మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్.. తర్వాత మనం కష్టపడాల్సిందే..
**************************************
*Janhvi Kapoor: జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?
**************************************
*Deen Raj: ఎన్నో కష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గర్వపడే సినిమా తీశాం
**************************************
*Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..
**************************************