Pushpa 2 Spoof: ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ స్పూఫ్.. సుకుమార్ చూస్తేనా?

ABN , Publish Date - Dec 31 , 2023 | 05:39 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. సోషల్ మీడియాలో తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు నెటిజన్లు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రకంగా సోషల్ మీడియా నుంచి వచ్చిన వారే ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారుతున్నారు. తాజాగా ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ అంటూ ‘పుష్ప2’కి స్పూఫ్‌గా తెరకెక్కిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Pushpa 2 Spoof: ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ స్పూఫ్.. సుకుమార్ చూస్తేనా?
Allu Arjun in Pushpa

ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. సోషల్ మీడియాలో తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు నెటిజన్లు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రకంగా సోషల్ మీడియా నుంచి వచ్చిన వారే ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారుతున్నారు. అలా 7 ఆర్ట్స్ వీడియోల ద్వారా సరయు, శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) వంటి వారు ఫుల్ ఫేమస్ అయ్యారు. వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు 7 ఆర్ట్స్‌లో ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ (Pushpa 2 First night) అంటూ ‘పుష్ప 2’ సినిమాగా స్ఫూఫ్‌గా ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. ఈ స్ఫూప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో స్పూఫ్‌లకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. అసలే దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ సినిమా ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. ‘పుష్ప 2’ కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న వేళ.. ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ అంటే ట్రెండ్ కాకుండా ఎలా ఉంటుంది. పుష్పలోని పాత్రలను పోలిన కారెక్టర్లే ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ ఉంటాయి. పుష్ప రాజ్‌గా శ్రీకాంత్ రెడ్డి.. శ్రీవల్లిగా సీమ (Seema) నటించారు. అయితే పుష్ప పాత్రలో శ్రీకాంత్ రెడ్డి నటించడమే కాకుండా.. ఈ స్పూఫ్‌కు కర్త కర్మ క్రియ అన్నీ కూడా అతనే కావడం విశేషం.


Srikanth-Reddy.jpg

ఈ కాన్సెప్ట్ రచించడంతో పాటు.. దర్శకత్వం, ఎడిటింగ్ కూడా శ్రీకాంత్ రెడ్డి చేయడం చూస్తుంటే అతని మల్టీ టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది. ఈ స్పూఫ్‌ షార్ట్ ఫిల్మ్‌కి వస్తున్న వ్యూస్, లైక్స్, కామెంట్స్ చూస్తుంటే.. నెటిజన్లు బాగా ఈ వీడియోకు కనెక్ట్ అవుతున్నారు. ‘పుష్ప 2’ కాన్సెప్ట్‌ ఎలా ఉంటుందో ఊహించుకుని తన స్టైల్లో శ్రీకాంత్ రెడ్డి ఈ స్పూప్‌ను ఎంచుకున్నాడు. షెకావత్ తనను బ్రాండ్ అంటూ అవమానించడం, పుష్ప రాజకీయాల్లోకి రావాలనుకోవడం, తన ఇంటి పేరు తనకు తిరిగి వచ్చి ఓ బ్రాండ్ ఏర్పడటం ఇలా శ్రీకాంత్ రెడ్డి రాసుకున్న స్పూఫ్ లైన్ బాగుందని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇందులో శ్రీకాంత్ రెడ్డి నటన, చిత్తూరు యాస, మిగతా పాత్రలు అన్నీ కూడా ఫన్నీగా ఉంటూ.. హాయిగా నవ్వుకునేలా చేస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే.. వీడియో స్టార్టింగ్‌లోనే సుకుమార్‌ (Sukumar) ‌కి ఏకలవ్య శిష్యుడిని అంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రకటించుకున్నారు.. క్షమించమని కూడా అడిగాడండోయ్..


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: మాస్‌ బీట్‌‌ని.. నెటిజన్లు మడతెట్టేస్తున్నారు..

*****************************

*Kotabommali PS in OTT: ‘కోటబొమ్మాళి PS’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*********************************

*Vijayakanth: ‘కెప్టెన్’ విజయకాంత్ గురించి ఆయన తోబుట్టువులు ఏం చెప్పారో తెలుసా?

************************************

*NBK109: ‘యానిమల్’ స్టార్‌ని బాలయ్య మూవీ సెట్స్‌లోకి ఆహ్వానించిన ఊర్వశి..

********************************

Updated Date - Dec 31 , 2023 | 05:39 PM