Priyanka Tumpala: 16 ఏళ్ల కెరీర్.. 150కి పైగా చిత్రాలు.. షేకాడిస్తోన్న డబ్బింగ్ ఆర్టిస్ట్
ABN , First Publish Date - 2023-06-27T21:03:22+05:30 IST
డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రియాంక తుంపాల.. తన కార్పొరేట్ వృత్తిని కొనసాగిస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కంటిన్యూ చేస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకు 16 ఏళ్ల కెరీర్‌లో, 150 పైగా చిత్రాలకు ఆమె డబ్బింగ్ అందించారు. ఆమె డబ్బింగ్ చెప్పిన మొదటి చిత్రం ‘విలేజ్‌లో వినాయకుడు’. ఆ సినిమాలో శరణ్య మోహన్‌కి చెప్పిన డబ్బింగ్‌తో గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె.. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. తన వాయిస్‌తో మెస్మరైజ్ చేస్తూనే ఉంది.
తెరపై హీరోయిన్ ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే.. నిజంగా హీరోయిన్నే అలా మాట్లాడుతుందేమో అనుకుంటాం. కానీ చాలా మందికి తెలియదు.. ఆ మాట్లాడుతుంది ఆ హీరోయిన్ కాదని. ఆ పెదవుల కదలిక వెనుక మరొకరి కంఠం వర్క్ చేస్తుందనే విషయం కూడా తెలియకుండా.. మ్యానేజ్ చేస్తుంటారు డబ్బింగ్ కళాకారులు. అలాంటి వారిలో ప్రస్తుతం భారీ క్రేజ్‌తో దూసుకెళుతోంది డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రియాంక తుంపాల (Priyanka Tumpala). తన కార్పొరేట్ వృత్తిని కొనసాగిస్తూనే ఆమె డబ్బింగ్ కెరీర్‌ని కూడా కంటిన్యూ చేస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకు 16 ఏళ్ల కెరీర్‌లో, 150 పైగా చిత్రాలకు ఆమె డబ్బింగ్ అందించారు. ఆమె డబ్బింగ్ చెప్పిన మొదటి చిత్రం ‘విలేజ్‌లో వినాయకుడు’ (Village Lo Vinayakudu). ఆ సినిమాలో శరణ్య మోహన్ (Saranya Mohan)కి చెప్పిన డబ్బింగ్‌తో గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె.. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. ఇప్పటి వరకు తన వాయిస్‌తో మెస్మరైజ్ చేస్తూనే ఉంది.
ఒక్కరూ కాదు ఇద్దరూ కాదు.. కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా, తమన్నా, తాప్సి, కీర్తి సురేష్, పూజా హెగ్డే, సాయి పల్లవి, రెజీనా, నభా నటేష్, నిధి అగర్వాల్, నేహా శెట్టి, అనన్య పాండే, ఐశ్వర్య లక్ష్మి, కేతిక శర్మ లాంటి స్టార్ హీరోయిన్స్ ఎందరికో ప్రియాంక తన వాయిస్ అందించడం విశేషం. డబ్బింగ్‌లో ఆమె ప్రతిభ గురించి చెప్పాలంటే.. ప్రతి నటీమణికి ప్రియాంక వారికి సెట్ అయ్యే విధంగా వైవిధ్యం చూపిస్తూ డబ్బింగ్ చెప్పడమే. ఒక నటికి మరొక నటికీ పోలిక లేకుండా.. వారి బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా వాయిస్ ఇవ్వడం ప్రియాంక ప్రత్యేకత. దర్శకులు, రచయితలు కోరుకున్న విధంగా ఆ పాత్రలకు ప్రియాంక తన డబ్బింగ్‌తో ప్రాణం పోయగలదు. (Dubbing Artist Priyanka Tumpala)
డిస్నీ మార్వెల్ సంస్థల గుర్తింపు పొందిన కొద్దిమంది ఇండియన్ వాయిస్ ఆరిస్ట్‌లలో ప్రియాంక ఒకరు.
కెప్టెన్ మార్వెల్ చిత్రంలో నటి బ్రీ లార్సెన్ పాత్రకి..
జంగిల్ క్రూజ్ చిత్రంలో ఎమిలీ బ్లంట్ పాత్రకి ..
ఎటెర్నల్స్ చిత్రంలో జెమ్మా చాన్ పాత్రకి..
ఎవెంజర్స్ ఎండ్ గేమ్‌లో కెప్టెన్ మార్వెల్ పాత్రకి.. అలాగే ఇండియానా జోన్స్ అండ్ ది డైల్ ఆఫ్ డెస్టినీ చిత్రంలో నటి ఫోబీ మేరీ వాలెర్ బ్రిడ్జి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ప్రియాంకే.
ఇంకా ప్రియాంక తుంపాల డబ్బింగ్ చెప్పిన కొన్ని చిత్రాల లిస్ట్ :
100 పర్సంట్ లవ్, బద్రీనాథ్, కెమెరామెన్ గంగతో రాంబాబు- తమన్నా
ఊహలు గుసగుసలాడే - రాశి ఖన్నా
రన్ రాజా రన్ - సీరత్ కపూర్
నేను శైలజ - కీర్తి సురేష్
ఘాజి - తాప్సి
గీతా గోవిందం - రష్మిక
తొలిప్రేమ - రాశి ఖన్నా
డీజే - పూజా హెగ్డే
గేమ్ ఓవర్ - తాప్సి
చెక్ - రకుల్ ప్రీత్ సింగ్
మిస్టర్ మజ్ను - నిధి అగర్వాల్
నన్ను దోచుకుందువటే - నభా నటేష్
సోలో బ్రతుకే సో బెటర్ -నభా నటేష్
ప్రతి రోజూ పండగే -రాశి ఖన్నా
పక్కా కమర్షియల్ -రాశి ఖన్నా
గాడ్సే -ఐశ్వర్య లక్ష్మి
అమ్ము -ఐశ్వర్య లక్ష్మి
ఊర్వశివో రాక్షసివో - అను ఇమ్మాన్యుయేల్
లైగర్ - అనన్య పాండే
1 నేనొక్కడినే - కృతి సనన్
నేనే రాజు నేనే మంత్రి - కాజల్
సీత - కాజల్
రంగ రంగ వైభవంగా - కేతిక
డీజే టిల్లు - నేహా శెట్టి
మారి 2 - సాయి పల్లవి
సార్ - సంయుక్త మీనన్.. వంటి ఎందరికో ఆమె డబ్బింగ్ అందించారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*OTT: ఓటీటీలో అమ్మకానికి మాయాబజార్.. ఎప్పుడంటే?
**************************************
*VJ Sunny: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి విజె సన్నీ.. కొత్త పార్టీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?
**************************************
*Venu Udugula: ఎవరొచ్చిరి ఏమిచ్చిరి.. ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి?
**************************************
*Rashmika Mandanna: నెటిజన్ షేర్ చేసిన వీడియో చూసి రష్మిక ఫుల్ ఖుష్.. అందులో ఏముందంటే?
**************************************
*NTR: ఎన్టీఆర్ ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ మూవీ గురించి ఈ విషయాలు తెలుసా?
**************************************