Anuj Gurwara: పాటలు పాడుకోకుండా.. ఎందుకయ్యా నీకీ భజన?
ABN , First Publish Date - 2023-07-27T20:48:39+05:30 IST
ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అలా ఖాళీగా ఉన్నవాళ్లనీ ఉద్దేశిస్తూ.. మన పెద్దవాళ్లు చాలా సామెతలు క్రియేట్ చేశారు. అలాగే ఇప్పుడో పర్సన్.. తను చేసే పని మానేసి.. భజన కార్యక్రమం పెట్టుకున్నట్లుగా.. ఒకటే ఊకదంపుడు ట్వీట్లతో నెటిజన్లను విసిగిస్తున్నాడు. అనుజ్ గుర్వారా అనే యాక్టర్ కమ్ సింగర్.. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్‌పై ప్రభుత్వం తరపున భజన చేస్తూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అలా ఖాళీగా ఉన్నవాళ్లని ఉద్దేశిస్తూ.. మన పెద్దవాళ్లు చాలా సామెతలు క్రియేట్ చేశారు. అలాగే ఇప్పుడో పర్సన్.. తను చేసే పని మానేసి.. భజన కార్యక్రమం పెట్టుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఒకటే ఊకదంపుడు ట్వీట్లతో నెటిజన్లను విసిగిస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరని అనుకుంటున్నారా?. ఇంకెవరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ (MagaDheera) చిత్రంలో ‘పంచదార బొమ్మా బొమ్మ’ పాటను పాడిన సింగర్, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఆనంద్’ (Anand) సినిమాలో నటించిన యాక్టర్ అనుజ్ గుర్వారా (Anuj Gurwara). ఇతగాడికి ఉండటానికి టాలెంట్ చాలా ఉంది కానీ ఏం ఉపయోగం? చేయాల్సిన వర్క్ మానేసి.. సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. ఇంతకీ అతను ఏం చేశాడని అనుకుంటున్నారా?
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా కదిలిస్తే చాలు.. వీడియోల రూపంలో అంతా దర్శనమిస్తున్నాయి. జూలై 24న హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్‌లోని చాలా ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా గచ్చిబౌలి IKEA రోడ్డులో ట్రాఫిక్ జామ్ దృశ్యాలు.. ఓ సినిమా సెట్టింగ్‌లా అనిపించాయి. IKEA రోడ్డులో ట్రాఫిక్ జామ్ వీడియోలను చూసిన వారంతా.. ఇది, హైదరాబాద్ పరిస్థితి అంటూ.. దీనికి పరిష్కారమే లేదా అంటూ ప్రశ్నల వర్షం సంధిస్తుంటే.. ఈ సింగర్ మాత్రం ఆ ఒక్క వీడియోని పట్టుకుని.. ప్రభుత్వంపై విరుచుకుపడతారా? అన్నట్లుగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు.
ఆ ఒక్క రోజు ట్రాఫిక్ జామ్ అయినందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ సోషల్ మీడియాలో చాలా మంది వార్ జరిపారు. ప్రభుత్వం చూడండి.. ఎలా సత్వర మార్గాన్ని కనుక్కున్నదో.. ఆఫీస్ వేళల టైమింగ్ మార్చి.. అసలు ట్రాఫిక్కే లేకుండా చేసిందంటూ.. భజన మొదలెట్టాడు. నిజమే ట్రాఫిక్ లేదు.. ఉండదు.. ఎలా ఉంటుంది? అన్ని సంస్థలకు సెలవులు ప్రకటించారు కదా. అలాంటప్పుడు ట్రాఫిక్ జామ్ ఎలా అవుతుంది. ఎవరూ ఉండరు కదా, ఎవరూ రోడ్లపైకి రారు కదా. ఖాళీగా ఉన్న రోడ్లను చూపించి.. ఇది ప్రభుత్వ గొప్పతనం అంటూ ఆయన చేస్తున్న భజనకు నెటిజన్లు కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
‘ఇతనికేదో ప్రభుత్వంతో పని ఉన్నట్లుంది.. అందుకే ఇలా భజన మొదలెట్టాడు’ అంటూ ఒకరు.. ‘పాటలు పాడుకోకుండా.. ఎందుకయ్యా నీకీ భజన?’ అంటూ మరొకరు ఇలా రియాక్ట్ అవుతున్నారు. వాన వచ్చినప్పుడే గొడుగు పట్టాలి అనే చందంగా కాకుండా.. పర్మినెంట్ సొల్యూషన్ కోసం చూడకుండా.. ఆఫీస్ టైమింగ్స్ మార్చాం.. ట్రాఫిక్ లేకుండా చేశాం అని చెప్పుకోవడం ఏంటో? అలా చెప్పుకుంటున్న వారికి.. కొంచెం కూడా బుర్రతో ఆలోచించకుండా ఈయన భజన చేయడం ఏమిటో? అంటూ అనుజ్ గుర్వారాపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Rajasekhar: ‘గబ్బర్‌సింగ్’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..
**************************************
*Jailer: తెలుగులోనూ దుమ్మురేపుతోన్న తమన్నా ఆట.. ‘జైలర్’ పాట
**************************************
*Tamannaah Bhatia: రెండు కోట్ల డైమండ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా
**************************************
*Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది
**************************************
*Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..
**************************************
*Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..
**************************************