M Prabhakar Reddy: చిత్రపురి కాలనీలో విగ్రహావిష్కరణ.. ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2023-06-30T21:33:10+05:30 IST
దివంగత నటుడు డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని చిత్రపూరి కాలనీలో ఏర్పాటు చేయబోతున్నారు ఆయన కుమార్తెలు, బంధువులు. జూలై 1 శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు MIG చిత్రపూరి కాలనీలో డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి (M Prabhakar Reddy).. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్థిరంగా నిలబడిపోయే పేరిది. తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన సమయంలో సినీకార్మికుల పక్షాన నిలిచినటుడాయన. ప్రభుత్వాన్ని ఒప్పంచి వారికి నివాస స్థలాలు ఇప్పించిన ధీశాలి. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్‌లో నేడు సినీకార్మికుల గృహవసతి లభించింది. అందుకే ఆ గృహసముదాయానికి ‘డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి’ అని నామకరణం చేశారు. ఇప్పుడాయన విగ్రహాన్ని ఆ కాలనీలో ఏర్పాటు చేయబోతున్నారు ఆయన కుమార్తెలు, బంధువులు. జూలై 1 శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు MIG చిత్రపూరి కాలనీలో డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. (M Prabhakar Reddy Statue at Chitrapuri Colony)
ప్రభాకర్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన పూర్తి పేరు మందడి ప్రభాకర్ రెడ్డి. సూర్యాపేట సమీపంలోని తుంగతుర్తిలో జన్మించారు. హైదరాబాద్ సిటీ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదివిన ప్రభాకర్ రెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో సీటు సంపాదించారు. 1955 నుండి 1960 వరకు ఎమ్.బి.బి.యస్. చదివారు. నటనపై ఆయనకి ఉన్న మక్కువ కారణంగా.. చదువుకునే రోజులలోనే నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు. నటుడిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. విలన్‌గా, తండ్రిగా.. ఇలా ఎన్నో పాత్రలకు ఆయన జీవం పోశారు. డాక్టర్ చదివినప్పటికీ.. ఎంతో వినయవిధేయతలతో ప్రభాకర్ రెడ్డి మసలుకొనేవారు. అందువల్ల యన్టీఆర్‌కు ప్రభాకర్ రెడ్డి అంటే ప్రత్యేకమైన గౌరవం ఉండేది.
నటుడిగానే కాకుండా రైటర్‌గానూ ప్రభాకర్ రెడ్డి తన కలం బలం చూపించారు. దాదాపు 21 తెలుగు సినిమాలకు ఆయన కథలు రాశారు. వాటిలో కొన్ని బ్లాక్‌బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీక దీపం, నాకు స్వతంత్రం వచ్చింది.. వంటి చిత్రాలకు కథను అందించింది ప్రభాకర్ రెడ్డే. 1997 నవంబర్ 25న ప్రభాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానంతరం ఆయన పేరు మీద చిత్రపురి కాలనీలో ఓ ఆసుపత్రి నెలకొల్పాలని ఆయన కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం
**************************************
*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!
**************************************
*Maamannan: చివరి నిమిషంలో తొలగిన కోర్టు చిక్కులు.. టాక్ ఏంటంటే?
**************************************
*Bro Teaser Talk: మామ అల్లుళ్ళ మాస్ ర్యాగింగ్..
**************************************
*Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ విడుదల ఎప్పుడంటే..
**************************************