Lahari Shari: అమీర్‌పేట్‌లో లహరి షారి హల్‌చల్.. ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-10-24T20:18:21+05:30 IST

సినీనటి లహరి షారి అమీర్‌పేట్‌లో హల్‌చల్ చేశారు. అమీర్‌పేట్‌లో ఆమె బాబా టెక్స్‌టైల్ మెషినరీ‌ని ప్రారంభించి.. మహిళా వ్యాపారవేత్తలకు మహిళల ఎదుగుదలకు ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

Lahari Shari: అమీర్‌పేట్‌లో లహరి షారి హల్‌చల్.. ఏం చేసిందంటే..
Lahari Shari

సినీనటి లహరి షారి (Lahari Shari) అమీర్‌పేట్‌లో హల్‌చల్ చేశారు. అమీర్‌పేట్‌లో ఆమె బాబా టెక్స్‌టైల్ మెషినరీ‌ (Baba Textile Machinery)ని ప్రారంభించి.. మహిళా వ్యాపారవేత్తలకు మహిళల ఎదుగుదలకు ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాబా టెక్స్‌టైల్ మెషినరీ, ఇంత పెద్ద కంపెనీ హైదరాబాద్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎంబ్రాయిడరీ ద్వారా మహిళా తన స్వతహాగా ఎదుగుతున్నది. ఎంబ్రాయిడరీ మెషీన్లు, బాబా టెక్స్‌టైల్ మెషినరీ ఉత్పత్తి శ్రేణి యొక్క ప్రత్యేకత ఏమిటంటే టెక్స్‌టైల్ పరిశ్రమలో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడమే. తమ వ్యాపారాలను స్థాపించడానికి మరియు ఆర్థికంగా ప్రయత్నించే మహిళా వ్యాపారవేత్తలకు, మహిళల ఎదుగుదలకు ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. త్వరలో ‘హాష్ టాగ్ AP 31’ మూవీ మరియు వరుణ్ తేజ్ మూవీలో నటించినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.


Lahari.jpg

అనంతరం బాబా టెక్స్‌టైల్ మెషినరీ బిజినెస్ హెడ్ కేశవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు, వ్యాపారాభివృద్దికి ఎంతో అనుకూల‌మైన ప్రాంతం. కంప్యూటరైజ్డ్‌ ఎంబ్రాయిడరీ యంత్రాలకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా.. బాబా టెక్స్‌టైల్‌ మెషినరీ సంస్థ తొలి శాఖను హైదరాబాద్‌‌లో ప్రారంభించ్చాం. రాష్ట్ర ప్రభుత్వం సహాకారం అందిస్తున్న కార‌ణంగానే రాష్ట్రంలో మొట్టమొద‌టి శాఖ‌ను ప్రారంభించామని కేశవ్‌ అగర్వాల్‌ తెలిపారు. త‌ద్వారా ఇక్కడి ప్రజ‌ల‌కు త‌మ ఉత్పత్తుల‌ను మ‌రింత చేరువ చేసే అవకాశం కలుగుతుందన్నారు. దేశంలో ఇప్పటికే ఎనిమిది స్టోర్స్ అందుబాటులో ఉన్నాయని.. రాష్ట్రంలో ఇదే తొలిస్టోర్‌ అని అన్నారు. అన్ని రకాల విస్తృతమైన శ్రేణి ఉత్పత్తులతో పాటు.. వినియోగదారుల సంతృప్తికి అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Devil: ‘డెవిల్’ స్టన్నింగ్‌ పోస్టర్‌.. సీక్రెట్‌ ఏజెంట్‌ ఏం ఉన్నాడులే..

**********************************************

*Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సక్సెస్‌పై బాలకృష్ణ ఏమన్నారంటే..

*********************************************

*Saripodhaa Sanivaaram: వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా.. ఆపగలరా?

********************************************

Updated Date - 2023-10-24T20:18:21+05:30 IST