Kuchipudi Venkat: ‘చిట్టిముత్యాలు’.. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌తో హ్యాపీ..
ABN , First Publish Date - 2023-11-24T22:36:41+05:30 IST
తను తీసిన రెండు సినిమాలు మంచి టాక్‌ని తెచ్చుకున్నప్పటికీ.. కమర్షియల్ సక్సెస్ కాకపోవడంతో హోటల్ రంగం వైపు అడుగులు వేశారు దర్శకనిర్మాత కూచిపూడి వెంకట్. హోటల్ రంగంలో మాత్రం ఆయన వరుస బ్లాక్‌బస్టర్స్ కొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్‌గా ఆయన ప్రారంభించిన చిట్టిముత్యాలు హోటల్‌కు మంచి స్పందన వస్తున్నందుకు కూచిపూడి వెంకట్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సినిమా రంగంలో సక్సెస్ ఇప్పటికీ ఆయనను ‘అందని ద్రాక్షపండు’లా ఊరిస్తూనే ఉంది. డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతూ... ఆయన తీసిన ‘మొదటి సినిమా’ (సినిమా పేరే ‘మొదటి సినిమా’.. నవదీప్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారానే పూనమ్ బజ్వా హీరోయిన్‌గా పరిచయమైంది), దర్శకనిర్మాతగా ఆయన తెరకెక్కించిన ‘జాన్ అప్పారావు 40 ప్లస్’ (సిమ్రాన్ - కృష్ణ భగవాన్) రెండు సినిమాలూ విమర్శకుల ప్రశంసలు దండిగా పొందినప్పటికీ... కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దర్శకుడిగా అవకాశాల కోసం తిరగడం ఇష్టం లేక... సొంతంగా సినిమాలు తీసే స్థాయికి చేరుకోవాలనే కసి, పట్టుదలతో.. హోటల్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి ఈరోజు ‘వంటల మాంత్రికుడు’కు మారారు దర్శకనిర్మాత కూచిపూడి వెంకట్ (Kuchipudi Venkat). ‘ఉలవచారు, రాజుగారి తోట, కూచిపూడి కిచెన్, రాజుగారి కోడి పలావ్, కూచిపూడి పలావ్, మారేడుమిల్లి’ వంటి రెస్టారెంట్స్‌తో ఈ రంగంలో తన పేరు మారుమ్రోగేలా చేసుకున్న కూచిపూడి వెంకట్ తాజాగా తనదైన శైలిలో ‘రొమాన్స్ విత్ రైస్’ అనే ట్యాగ్‌లైన్ జోడించి ‘చిట్టిముత్యాలు’ పేరుతో మరో పసందైన విందు భోజనశాలకు శ్రీకారం చుట్టారు. దిల్ రాజు, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, టి.జి.విశ్వప్రసాద్ తదితర చిత్ర ప్రముఖుల చేతుల మీదుగా ఇటీవల ఎంతో ఘనంగా మొదలైన ‘చిట్టిముత్యాలు (Chittimuthyalu) - రొమాన్స్ విత్ రైస్’కు భోజన ప్రియుల నుంచి వస్తున్న స్పందనతో.. సినిమా ఇండస్ట్రీలో కొట్టలేకపోయిన ‘బ్లాక్ బస్టర్’ని కొట్టాననే ఫీల్‌ని ఇచ్చిందని అంటున్నారాయన.
తన పేరు మీద కూచిపూడి వెంకట్ ఆవిష్కరించిన ‘కూచిపూడి పలావ్’.. చాలా తక్కువ ఖర్చుతో నిమిషాల్లో వేడి వేడి పలావ్ స్వయంగా చేసుకుని తినగలగడం, షెఫ్స్ అవసరం లేకుండా పలావ్ సర్వ్ చేయగలగడం ప్రపంచ హోటల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. తెలుగువాడి ఘనత ప్రపంచమంతా వినిపించేలా.. ‘కూచిపూడి పలావ్’ దేశవిదేశాల్లో అతి త్వరలో లభ్యం కానుంది. ఇక ఈ దర్శకనిర్మాతకు హోటల్ రంగంలో ఎనలేని పేరు, గౌరవం తెచ్చిపెట్టింది ‘మారేడుమిల్లి’. పద్దెనిమిది వేల చదరపు అడుగుల సువిశాల వైశాల్యంలో, బ్యాంకెట్ హాల్ సదుపాయం కలిగి, అత్యంత ఆహ్లాదకర వాతావరణం, నోరూరించే వంటకాలతో ... హైదరాబాద్‌లోని మాదాపూర్ - హైటెక్ సిటీ నడుమ ఇమేజ్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ‘చిట్టిముత్యాలు’ (రొమాన్స్ విత్ రైస్)కు వస్తున్న స్పందన చూసి.. కూచిపూడి వెంకట్ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. ‘నేను పెట్టే ప్రతి రెస్టారెంట్ కోసం నా ప్రాణం పెడతాను. కాబట్టి నేను స్టార్ట్ చేసే ప్రతి హోటల్ పెద్ద సక్సెస్. ఆ అనుభవసారాన్నంతట్నీ రంగరించి, మరింత ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దిన చిట్టిముత్యాలు కూడా ఒక రేంజ్‌లో సూపర్ హిట్ అవుతుందని ఊహించాను. కానీ మా అంచనాలను మించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కావడం మాకు చాలా గర్వంగా ఉండడమే కాదు... మా బాధ్యతను మరింత పెంచింది’ అని అంటున్నారు ఫుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ కూచిపూడి వెంకట్. త్వరలో ఈ చిట్టిముత్యాలతో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
====================
*Vikram Rathod: విజయ్ ఆంటోని సినిమాకు విడుదల తేదీ ఫిక్సయింది.
*******************************
*Eagle: రవితేజ సినిమాకి ఇంకా 50 రోజులే..
********************************
*Akka: కీర్తి సురేష్, రాధికా ఆప్టేలతో రహస్యంగా YRF వెబ్ సిరీస్
*******************************