Chittimutyalu: చిట్టిముత్యాలు (రొమాన్స్ విత్ రైస్).. సినిమా టైటిల్ కాదండోయ్..
ABN , First Publish Date - 2023-11-17T19:32:09+05:30 IST
పేరు ‘చిట్టిముత్యాలు’.. రొమాన్స్ విత్ రైస్ అనేది ట్యాగ్‌లైన్. టైటిల్, ట్యాగ్‌లైన్ అనగానే ఇదేదో సినిమా అని, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారని అనుకుంటున్నారేమో. అలాంటిదేమీ లేదు. ఇది సినిమా టైటిల్ కాదు.. టాలీవుడ్ స్టార్ నిర్మాతలు దిల్ రాజు, టి.జి. విశ్వప్రసాద్.. దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంచ్ అయిన రెస్టారెంట్.
పేరు ‘చిట్టిముత్యాలు’ (Chittimutyalu).. రొమాన్స్ విత్ రైస్ అనేది ట్యాగ్‌లైన్. టైటిల్, ట్యాగ్‌లైన్ అనగానే ఇదేదో సినిమా అని, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారని అనుకుంటున్నారేమో. అలాంటిదేమీ లేదు. ఇది సినిమా టైటిల్ కాదు.. టాలీవుడ్ స్టార్ నిర్మాతలు దిల్ రాజు, టి.జి. విశ్వప్రసాద్.. దర్శకులు హరీష్ శంకర్ (Harish Shankar), అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేతుల మీదుగా లాంచ్ అయిన రెస్టారెంట్. ఫుడ్ ఇండస్ట్రీలో అనేక విప్లవాలు అలవోకగా ఆవిష్కరిస్తూ వంటల మాంత్రికుడిగా పేరు గడించారు దర్శకుడు కూచిపూడి వెంకట్. ఆయన ఆలోచన నుండి వచ్చిన మరో టైటిలే ‘చిట్టిముత్యాలు’.
‘ఉలవచారు, రాజుగారి తోట, కూచిపూడి పలావ్, రాజుగారి కోడి పలావ్, మారేడుమిల్లి’ వంటి విజయాలతో ఫుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న కూచిపూడి వెంకట్, తాజాగా ‘చిట్టిముత్యాలు’ పేరుతో మరో రెస్టారెంట్‌కు శ్రీకారం చుట్టారు. స్వతహాగా ఆయన దర్శకుడు కావడంతో సినిమా కోణంలో ఆలోచించి.. ‘రొమాన్స్ విత్ రైస్’ అనే ట్యాగ్‌లైన్ కూడా జత చేశారు. హైదరాబాద్, హైటెక్ సిటీ సమీపంలో... మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని ఇమేజ్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ‘చిట్టిముత్యాలు’ను నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), టీజీ విశ్వప్రసాద్ (TG Viswa Prasad).. దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ప్రారంభించారు. దిల్ రాజు, రెస్టారెంట్ రిబ్బన్ కట్ చేయగా, హరీష్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనిల్ రావిపూడి ‘మెను’ లాంచ్ చేయగా, విశ్వప్రసాద్ క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశారు.
ఈ సందర్భంగా.. ఇంతటి అత్యద్భుత ఆహ్లాదకర వాతావరణం సృష్టించి, ఎంత తిన్నా తనివి తీరని నోరూరించే వంటకాలతో భోజనప్రియుల మనసులు దోచుకోవడం కూచిపూడి వెంకట్‌కు మాత్రమే సాధ్యమని దిల్ రాజు, అనిల్ రావిపూడి అంటే.. ‘చిట్టిముత్యాలు’ హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో ఓ మణిహారంలా భాసిల్లడం ఖాయమని టి.జి.విశ్వప్రసాద్, హరీష్ శంకర్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెస్టారెంట్స్ ఏర్పాటు చేయడం తనకు ప్యాషన్ అని ప్రకటించిన కూచిపూడి వెంకట్ (Kuchipudi Venkat)... ‘చిట్టిముత్యాలు’తో ఒక గొప్ప భోజనానుభూతిని పంచేందుకు చాలా నెలలు శ్రమించామని తెలిపారు. ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసిన శ్రేయాస్ శ్రీనివాస్‌కు వచ్చిన అతిథులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
========================
*KR Vijaya: కెఆర్ విజయ @ 60
*****************************
*Anushka Sharma: నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు.. కోహ్లీపై అనుష్క శర్మ పోస్ట్ వైరల్
**************************
*Malvika Sharma: ‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్ విడుదల
*******************************