Chiranjeevi: తమ్ముడూ.. జస్ట్ డు కుమ్ముడు.. దేవిశ్రీ మ్యూజికల్ కన్సర్ట్‌పై చిరు

ABN , First Publish Date - 2023-06-10T20:47:37+05:30 IST

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ. విశ్వప్రసాద్, నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ కన్సర్ట్‌లను అమెరికాలో నిర్వహించబోతున్నారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌‌కు సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియో‌ను సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా శనివారం లాంచ్ చేశారు.

Chiranjeevi: తమ్ముడూ.. జస్ట్ డు కుమ్ముడు.. దేవిశ్రీ మ్యూజికల్ కన్సర్ట్‌పై చిరు
DSP and Chiranjeevi

నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ (The North American Seemandhra Association) నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. RRR సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్మాత టీజీ. విశ్వప్రసాద్ (TG Vishwaprasad) ఆధ్వర్యంలో నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంయుక్తంగా నిర్వహించారు. రీసెంట్‌గా సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల (Ram Miriyala)తో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్‌లు నిర్వహించారు. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ. విశ్వప్రసాద్, నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ (Rockstar Devi Sri Prasad)తో ఇదే మాదిరిగా మ్యూజిక్ కన్సర్ట్‌లను నిర్వహించబోతున్నారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌‌కు సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియో‌ను సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అధికారికంగా శనివారం లాంచ్ చేశారు.

‘లవ్ యు మై బాయ్.. జస్ట్ డు కుమ్ముడు. అమెరికాలో జరగబోతోన్న మ్యూజిక్ కన్సర్ట్ నిమిత్తం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరియు అతని బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ చిరంజీవి (Chiranjeevi) డిఎస్‌పి కన్సర్ట్‌ (#DSPOoAntavaTourUSA)కి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెగాస్టార్ ట్వీట్‌కు ఫ్యాన్స్ కూడా స్పందిస్తూ.. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అండ్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చిరు ట్వీట్ వైరల్ అవుతోంది.

Dsp.jpg

కాగా.. ఈ కన్సర్ట్ జూలై 2న డల్లాస్ (Dallas), జూలై 8న ఫిలడెల్ఫియా (Philadelphia), జూలై 15న సియాటెల్ (Seattle), జూలై 22న సాన్‌జొస్ (San Jose), జూలై 29న చికాగో (Chicago)లో జరగునుంది. ఈ కన్సర్ట్‌లో సింగర్ ఇంద్రవతి, సాగర్, గీతా మాధురి, హేమ చంద్ర, రీటా, పృథ్వీ, మౌనిక వంటి సింగర్స్ పాల్గొనబోతుండగా.. యాంకర్ మరియు నటి అనసూయ (Anasuya) ఈ షోస్‌ను హోస్ట్ చేయనుంది. ఈ విషయం చిరు (Chiru) విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లో తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్


*************************************************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

***********************************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

**************************************************************

*Megha Akash: అవన్నీ వదంతులే.. మేఘా ఆకాష్ డేటింగ్ వార్తలపై తల్లి క్లారిటీ

*Mahi V Raghav: ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అయినా ముందే హెచ్చరిక చేశాం

*Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను

Updated Date - 2023-06-10T20:47:37+05:30 IST