Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..
ABN , First Publish Date - 2023-03-28T10:11:31+05:30 IST
టాలీవుడ్‌లో స్టైలిష్ హీరో అంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ (Allu Arjun).
టాలీవుడ్‌లో స్టైలిష్ హీరో అంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ (Allu Arjun). తన డ్రెస్సింగ్‌తో పాటు మూవీస్‌లో తన డ్యాన్స్ మూమెంట్స్‌తో ట్రెండ్ సెట్ చేశాడు. 2001లో మామయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ (Daddy) సినిమాలో డ్యాన్సర్‌గా చిన్న పాత్రలో మెరిసిన బన్నీ.. 2003 వచ్చిన ‘గంగ్రోత్రి’ సినిమాతో హీరోగా మారాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. అయితే.. అల్లు అర్జున్‌పై రకరకాల విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ తర్వాత వచ్చిర ‘ఆర్య’ (Aarya) సినిమాతో సమాధానం తెలిపాడు.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్‌కి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును తెచ్చి పెట్టడంతోపాటు.. స్టైలిష్ స్టార్ అనే బిరుదును తీసుకొచ్చి పెట్టింది. తర్వాత ‘బన్నీ’, ‘దేశముదురు’, ‘పరుగు’ వంటి వరుస హిట్లు సాధించి స్టార్‌గా మారిపోయాడు. మధ్య కొన్ని ప్లాపులు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని నిలబడి తన స్టార్‌డమ్‌ని నిలబెట్టుకున్నాడు. అనంతరం వచ్చిన ‘ఆర్య 2’, ‘వేదం’, ‘జులాయి’, ‘రేసు గుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి వరుస హిట్లతో తన రేంజ్‌తో పాటు మాస్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వెళ్లాడు. అంతేకాకుండా ఏ తెలుగు హీరోకి లేనట్లు కేరళలో అల్లు అర్జున్‌ని ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారు. అక్కడి ఫ్యాన్స్ ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుచుకుంటూ ఉంటారు. (#20ICONICyearsofAlluArjun)
ఇక.. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) సినిమా బన్నీని పాన్ ఇండియా స్టార్‌ని చేసేసింది. ఆ తర్వాత నుంచి ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో.. తర్వాత రాబోయే సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule) మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ చిత్రం ఎప్పుడూ విడుదలైన రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని బన్నీ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. కాగా.. ఆయన మొదటి సినిమా ‘గంగ్రోత్రి’ విడుదలై నేటికి 20 ఏళ్లు గడిచిపోయాయి. (Icon Star Allu Arjun)
దీంతో.. ఫ్యాన్స్2తో ప్రముఖులు, నిర్మాణ సంస్థలు బన్నీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. జర్నీని ఇలా విజయవంతంగా కొనసాగిస్తూ మరింత ఎత్తుకు ఎదగాలని కామెంట్లు చేస్తున్నారు. అలాగే.. త్వరలోనే ‘గ్లోబల్ ఐకాన్’గా మారాలంటూ కోరుకుంటున్నారు. అంతేకాకుండా.. ట్విట్టర్‌లో ‘GLOBAL ICON ALLUARJUN’, ‘#20ICONICyearsOfAlluArjun’ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే.. ఈ సందర్భంగా ‘దేశముదురు’ చిత్రానికి రీ-రిలీజ్ చేసే ఆలోచన ఆ చిత్ర నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన అధికారికి ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం.
కాగా.. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. ‘నేటితో నేను చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. నాకు ఆశీర్వాదాలతో పాటు చాలా ప్రేమను కూడా అందించారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకులు, ఆరాధకులు, అభిమానుల ప్రేమ కారణంగానే ఇలా ఉన్నాను. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..
Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..
Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..
NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..
Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..
LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?
Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం
Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..