Oscars 2023: ఆస్కార్ పండుగ ఎప్పుడు..? ఎన్ని గంటలకు?.. ఎలా చూడొచ్చంటే..?
ABN , First Publish Date - 2023-03-10T19:04:14+05:30 IST
సినీ ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్స్ (Oscars). మూవీ లవర్స్ అందరు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇండియా నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ఆస్కార్ కోసం పోటీపడుతుంది.
సినీ ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్స్ (Oscars). మూవీ లవర్స్ అందరు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇండియా నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ఆస్కార్ కోసం పోటీపడుతుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అకాడమీ నామినేషన్ సాధించింది. అందువల్ల భారతీయ సినీ అభిమానులు ఈ పురస్కారాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ప్రసారమవుతుంది..? ఏ విధంగా వీక్షించవచ్చు ..? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఆ ఆస్కార్ వివరాలు మీ కోసం..
ఆస్కార్ అవార్డ్స్‌ను 95వ (Oscars95) సారి ప్రదానం చేయబోతున్నారు. లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ పురస్కారాలను అందజేస్తారు. భారత కాలమాన ప్రకారం మార్చి 13న ఉదయం 5.30AM లకు ఈ అవార్డ్స్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. భారత్‌లోని ప్రేక్షకులు ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో ఈ ప్రసారాలను వీక్షించవచ్చు. ABC.com, ABC యాప్‌లోను ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. ఈ అవార్డ్స్‌కు కమెడియన్ జిమ్మి కెమ్మెల్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
అకాడమీ అవార్డ్స్‌లో భాగంగా ‘నాటు నాటు’ లైవ్ కన్సర్ట్ ఉంటుంది. ఈ లైవ్ కన్సర్ట్‌లో కీరవాణి, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాల్గొననున్నారు. దీపికా పదుకొణెకు ఆస్కార్ ప్రజెంటర్‌గా అవకాశం దక్కింది. ఎమిలి బ్లంట్, శామ్యూల్ జాక్సన్, డ్వేన్ జాన్సన్, మైఖేల్ జోర్డాన్ తదితరులు ఈ పురస్కారాలను అందివ్వనున్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!
Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు
Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!
Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!
Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్ ఛాన్స్ ఎవరికంటే..?
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్