OTT: ఓటీటీలోకి వచ్చేసిన.. కొరియన్ స్పేస్ అడ్వెంచర్ సర్వైవల్ డిజాస్టర్! ఎందులో అంటే?
ABN , First Publish Date - 2023-12-08T19:28:15+05:30 IST
ఓటీటీ ప్రేక్షకులను ఆలరించడానికి మరో ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమా వచ్చేసింది. కొరియన్ స్పేస్ అడ్వెంచర్ సర్వైవల్ డిజాస్టర్ డ్రామా జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ఆవార్డులు సైతం గెలుచుకుంది.

ఓటీటీ ప్రేక్షకులను ఆలరించడానికి మరో ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమా వచ్చేసింది. అదీ కూడా చాలా మంది ఇష్టపడే కొరియన్ చిత్రమవడం విశేషం. కొరియన్ స్పేస్ అడ్వెంచర్ సర్వైవల్ డిజాస్టర్ డ్రామా జానర్ లో వచ్చిన ది మూన్ (The Moon). కిమ్ యోంగ్-హ్వా (Kim Yong-hwa) రచన,దర్శకత్వంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరించగా సోల్ క్యుంగ్ గు, దో క్యుంగ్ సూ, కిమ్ హీ ఏ ప్రధాన పాత్రల్లోనటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ఈవెంట్ లలో ఆవార్డులు సైతం గెలుచుకుంది.
చంద్రునిపై మనషుల అన్వేషణ, అక్కడ ఒంటరిగా ఉండటం అనే నేపథ్యంలో వచ్చిన మొట్టమొదటి సౌత్ కొరియన్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ దేశం చంద్ర మండలంపైకి మొదటిసారిగా మనషులను పంపించేందుకు చేసిన ప్రయత్నం భారీ ప్రమాదంతో విఫలమవుతుంది. మళ్లీ ఐదేండ్లకు మరోసారి ప్రయోగం చేయగా మధ్యలోనే సౌర తుఫాను వల్ల ఓ వ్యోమగామి అంతరిక్షంలో చిక్కుకుపోతాడు. అతనిని సురకక్షితంగా తీసుకురావడానికి స్పేస్ సెంటర్ చేసే ప్రయత్నాలతో ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా ఉంటుంది.
2023 ఆగస్లులో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చాలా రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో కొరియన్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ రోజు(శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సినిమాలో నటులు యాక్టింగ్, ఎమోషన్స్, విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. హాలీవుడ్ , డబ్బింగ్ చిత్రాలంటే ఆసక్తి ఉన్న వారు ఈ సినిమాను హాయిగా ఆస్వాదించొచ్చు.