OTT: మొత్తానికి ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌.. హాలీవుడ్ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌, సైంటిఫిక్ మూవీ

ABN , First Publish Date - 2023-11-15T14:37:39+05:30 IST

మొత్తానికి చాలా మంది సినీ అభిమానులు కొంత‌కాలంగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌, సైంటిఫిక్ మూవీ ఇండియానా జోన్స్ డ‌య‌ల్ ఆఫ్‌ది డెస్టినీ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

OTT: మొత్తానికి ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌.. హాలీవుడ్ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌, సైంటిఫిక్ మూవీ
INDIANA JONES

మొత్తానికి చాలా మంది సినీ అభిమానులు కొంత‌కాలంగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌, సైంటిఫిక్ మూవీ ఇండియానా జోన్స్ డ‌య‌ల్ ఆఫ్‌ది డెస్టినీ (Indiana Jones and the Dial of Destiny) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను క‌లిగి ఉన్న ఈ సినిమా జూన్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మిక్స్‌డ్ టాక్‌తో యావ‌రేజ్ చిత్రంగా నిలిచింది. అయితే థియేట‌ర్ల‌లో రిలీజైన 50 రోజుల త‌ర్వాత ఓటీటీలోకి రావాల్సి ఉన్న ఈ చిత్రం కాస్త ఆల‌స్యంగా ఓటీటీలోకి వ‌స్తున్న‌ది.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ ద‌ర్శ‌కత్వంలో హ‌రిస‌న్ ఫోర్డ్ (Harison Ford) హీరోగా మొద‌లైన ఈ ఇండియానా జోన్స్ సిరీస్‌లో మొద‌ట‌గా ‘రైడ‌ర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ (1981) రాగా ఆ త‌ర్వాత 1984లో ‘ఆండ్ ది టెంపుల్ ఆఫ్ ది డూమ్ , 1989లో ‘ది లాస్ట్ క్రూసెడ్‌’, చివ‌ర‌గా 2008లో ‘కింగ్‌డ‌మ్ ఆప్‌ది క్రిష్ట‌ల్ స్క‌ల్’ సినిమాలు విడుదలై ఒక‌దాన్ని మించి మ‌రోటి సినీ అభిమానుల‌ను వీప‌రీతంగా ఆక‌ట్టుకోగా వారిరువురికి ఎన‌లేని పేరును తీసుకువ‌చ్చింది. ఈ క్ర‌మంలో 1992లో ‘ది యంగ్ ఇండియానా జోన్స్ క్రానిక‌ల్స్‘ పేరిట వెబ్ సిరీస్ కూడా తెర‌కెక్కించారు.


మ‌ళ్లీ 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ ఫ్రాంచైజీలో 5వ భాగంగా చివ‌రి చిత్రంగా ‘ఇండియానా జోన్స్ డ‌య‌ల్ ఆఫ్‌ది డెస్టినీ’ 2023 జూన్ 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ సినిమాకు స్పీల్‌బ‌ర్గ్ కాకుండా జేమ్స్ మాన్‌గోల్డ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా అశించినంత విజ‌యం సాధించ‌లేక పోయింది.

కాగా ఆగ‌స్టులోనే ఓటీటీలోకి రావాల్సిన ఈ సినిమా కొన్ని ఫైనాన్స్ సంబంధిత ఇష్యూల‌తో వాయిదా ప‌డుతూ 150 రోజుల త‌ర్వాత స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్ర‌ముఖ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబ‌ర్ 1నుంచి ప్ర‌సారం కానుంది. ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో ఈ సినిమాను మిస్స‌య్యారో ఇక ఇంట్లోనే చూసేందుకు రెడీ అవండి.

Updated Date - 2023-11-15T14:45:20+05:30 IST