‘సలార్’, ‘డంకీ’నే అనుకుంటున్నారా? వీటికి మించిన సినిమా అదే రోజు..?
ABN , First Publish Date - 2023-12-15T15:54:53+05:30 IST
ఇప్పుడు మన దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నపేర్లు డంకీ, సలార్. ఈ సినిమాల విడుదల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులేసుకుని మరి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వాటికి జేజేమ్మ చిత్రం అదే రోజు విడుదల కానుంది. దీని ప్రభావం ఆ రెండు సినిమాలపై పడే అవకాశం అధికంగా ఉంది.
ఇప్పుడు మన దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నపేర్లు డంకీ (Dunki), సలార్ (Salaar Cease Fire). ఈ సినిమాల విడుదల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులేసుకుని మరి ఎదురు చూస్తున్నారు. పైపెచ్చు మాదంటే మా హీరో సినిమా టికెట్లు ఎక్కువగా బుక్కవుతున్నాయని, మా హీరోదో పైచేయి అని , మాదే హిట్ అవుతుందని, రికార్డు కలెక్షన్లు వస్తాయని ఇది బాలీవుడ్ వర్సైస్ టాలీవుడ్ యుద్దం అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. అటు షారుఖ్(Shah Rukh Khan), ఇటు ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో కత్తులు, తుపాకులు లేని ట్వీట్ల వార్ కూడా చేసుకుంటూ కనిపిస్తే కొట్టేదామన్న పద్దతిలో ట్వీట్ల సునామీ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాల సమయంలోనే వాటికి జేజేమ్మ అయిన హాలీవుడ్ చిత్రం ఆక్వామెన్ 2 (Aquaman And The Lost Kingdom) విడుదల ఉందనే సంగతే మరిచిపోయారు. ఈ చిత్రం ప్రభావం ఆ రెండు సినిమాలపై పడే అవకాశం అధికంగా ఉంది.
2018లో వచ్చిన ఆక్వామెన్ (సముద్ర పుత్రుడు) సినిమా అప్పట్లోనే ఇండియా మొత్తంలో రూ.80 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. మన దేశంలో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన హలీవుడ్ చిత్రాల జాబితాలో అవెంజర్స్ ది ఎండ్ గేమ్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ఆక్వామెన్ ది లాస్ట్ కింగ్‌డమ్ షారుఖ్ ఖాన్ డంకీ (Dunki), ప్రభాస్ సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్న రోజే డిసెంబర్ 22న వప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది. ఇప్పటికే నాలుగైదు సార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 20 నుంచి 22కు విడుదల తేదీని మార్చుకుంది. ఇప్పుడు ఇదే చిత్రం డంకీ, సలార్ రెండు సినిమాలకు దెబ్బకొట్టే అవకాశం ఉంది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలీడేస్ కలిసొస్తాయని చిత్రాల నిర్మాతలు డిసెంబర్ 21, 22 తేదీలను సెలక్ట్ చేసుకోవడం ఇప్పుడు వారికే తలనొప్పిగా మారింది, డిస్టిబ్యూటర్లకు సైతం సమస్యలు తప్పేలా లేవు.
DC ఎక్స్‌టెండెడ్ యూనివర్స్‌లో భాగంగా దాదాపు 2వేల కోట్లతో రూపొందిన అక్వామెన్ 2 (Aquaman And The Lost Kingdom) సినిమాకు మొదటి భాగానికి దర్శకత్వం వహించిన జేమ్స్ వాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా జాసన్ మోమో (Jason Momoa), బెన్ అఫ్లెక్, ప్యాట్రిక్ విల్సన్, నికోల్ కిడ్మన్ (Nicole Kidman), అంబర్ హర్డ్ (Amber Heard) వంటి గ్లోబల్ సూపర్ స్టార్స్ నటిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే థియేటరికల్ హక్కులతో పెట్టిన ఖర్చులో సగం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మన రెండు సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.పైగా ఆక్వామెన్ చిత్రాలకు మన దేశంతో పాటు ఇతర కంట్రీస్‌లోనూ క్రేజ్ అంతకుమించి అన్నట్లుగా ఉంటుంది.
ఈక్రమంలో అక్కడి మల్టీఫ్లెక్స్‌లు, థియేటర్లు, ఐమాక్స్ యాజమాన్యాలు అక్వామెన్ (Aquaman And The Lost Kingdom) చిత్రానికి కాదని డంకీ, సలార్‌లకు ఇచ్చే అవకాశం ఏ మాత్రం ఉండదు. దీంతో ఈ ఎఫెక్ట్ డంకీ (Dunki), సలార్ (Salaar Cease Fire) సినిమాల ఓపెనింగ్స్‌కు గట్టి దెబ్బే పడనుంది. కాకుంటే డంకీ ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 21న విడుదల అవుతుండడం వల్ల కాస్త రెవెన్యూ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సలార్‌కు మాత్రం ఇది కత్తి మీద సాము లాంటి సమస్యే. కేజీఎఫ్ రేంజ్‌లో సినిమా ఉంటేనే తప్పా డంకీ, సలార్ చిత్రాలకు గ్లోబల్‌గా కలెక్షన్ల సమస్య తప్పదు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాల మధ్య పోటీ ఎవరినీ డిస్టర్బ్ చేస్తుందనేది వేచి చూడాలి.