Al pacino: 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి కాబోతున్నాడు!
ABN , First Publish Date - 2023-06-01T14:05:19+05:30 IST
హాలీవుడ్ నటుటు అల్ పెచినో 83 ఏళ్ల వయసులో.. తండ్రి కాబోతున్నాడు. నాలుగోసారి ఆయన డాడీ అని పిలిపించుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

హాలీవుడ్ (Hollywood) నటుటు అల్ పెచినో (Al Pacino)83 ఏళ్ల వయసులో.. తండ్రి కాబోతున్నాడు. నాలుగోసారి ఆయన డాడీ అని పిలిపించుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 83 ఏళ్ళ పాచినో, 29 ఏళ్ల నూర్ అల్ఫల్లా(Noor Alfallah)తో ప్రేమలో ఉన్నారు. కరోనా సమయం నుంచే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని సమాచారం. అయితే వీరిద్దరూ ప్రేమ, డేటింగ్ అంటూ తిరుగుతున్నారనే వార్తలు ఏప్రిల్, 2022లో బయటకు వచ్చాయి. ఈ క్రమంలో నూర్ గర్భం దాల్చినట్లు గత ఏడాది తెలిసింది. ఇప్పుడు ఆమెకు ఎనిమిది నెలలట. మరో నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం అల్ పచినో తండ్రి కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఏప్రిల్ నెలలో అల్ పచినో 83వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు.
పెళ్లి అంటే దూరంగా ఉండే అల్ పాచినో గతంలో ఇద్దరితో ప్రేమాయణం సాగించారు. మొదట యాక్టింగ్ కోచ్ జన్ తరంత్‌తో డేటింగ్ చేయగా 1989లో ఈ జంటకు జూలీ అనే పాప పుట్టింది. డయాన్ కిటెన్‌తోనూ డేటింగ్ చేశారు. తదుపరి నటి బెవెర్లీ డి ఏంజెలోతో సహజీవనం చేయగా వీరికి ఒలీవియా, ఆంటన్ కవలలు జన్మించారు. కానీ ఈ రిలేషన్ ఎక్కువ కాలం సాగలేదు. 1997-2003 సమయంలో కలిసి ఉన్నారు, తర్వాత విడిపోయారు. అనంతరం అల్ పాచినో నూర్‌తో ప్రేమలో పడ్డాడు. అప్పటికే ఆమెకు రోలింగ్ స్టోన్ మెంబర్ మిక్ జాగర్, నికోలక్ బెరగ్రూన్‌లతో ప్రేమలో పడింది. కొంతకాలానికే ఇద్దరితో బ్రేకప్ కూడా జరిగిపోయింది. పాచినో, నూర్‌కు ఇది మూడో వ్యక్తితో డేటింగ్. ఇప్పటిదాకా అల్ పాచినో ప్రేమ, సహజీవనం తప్ప పెళ్లి వరకూ వెళ్లలేదు.