Pooja Hegde: షాపు ఓపెనింగ్ పారితోషికం తెలిస్తే షాకవుతారు, అదీ పూజహెగ్డే కి వున్న డిమాండ్
ABN , First Publish Date - 2023-08-26T12:43:48+05:30 IST
పూజహెగ్డే కి ఇంకా డిమాండ్ తగ్గలేదు. ఆమె నిన్న కడపలో ఒక షాపు ఓపెనింగ్ కి వెళ్ళింది. అక్కడ కేవలం కొన్ని గంటలు మాత్రమే వుంది, ఆమె ఆలా ఆ కొన్ని గంటలకి తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు
అగ్ర నటీమణుల్లో ఒకరు అయిన పూజ హెగ్డే (PoojaHegde) ఇప్పుడు తెలుగు సినిమా ఏదీ చెయ్యకపోవచ్చు కానీ, ఆమెకి డిమాండ్ మాత్రం ఏమీ తగ్గలేదు అనే చెప్పాలి. 'ఆల వైకుంఠపురంలో' #AlaVaikuntapuramLo సినిమాలో అల్లు అర్జున్ (AlluArjun) పక్కన నటించిన పూజ హెగ్డేకి (PoojaHegde) ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మంచి విజయాన్ని అందించింది. కానీ ఆ తరువాత ఆమెకి ఎందుకో అంతగా విజయం సాధించలేదు, అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలు ఏమీ చేతిలో లేవు, కానీ మంచి కథతో వున్న సినిమా చెయ్యాలని ఎదురు చూస్తోంది.
అయితే పూజ హెగ్డే కి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. నిన్న కడపలో ఆమె ఒక షాపు ఓపెనింగ్ కి వెళ్ళింది. అక్కడ ఆమెని చూడటానికి విపరీతమైన జనాలు, ఆమె అభిమానులు వచ్చారు. నిన్న శ్రావణ శుక్రవారం కూడా కావటంతో, పూజహెగ్డే చేత వాళ్ళు ఆ షాపుని ఓపెన్ చేయించారు. పూజ హెగ్డే కూడా ఒక చీర కట్టుకొని వెళ్ళింది, అలాగే ఆమెకి చీర అంటే ఎంత ఇష్టమో కూడా చెప్పింది. ఆమె సినిమాలో పాటలకి డాన్సులు కూడా చేసింది ఆ షాపు ఓపెనింగ్ అప్పుడు.
ఇంతకీ ఆ షాపు ఓపెనింగ్ కి పూజ హెగ్డే తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు. ఒక్కరోజుకి ఆమెకి అంత పారితోషికమా అని ముక్కుమీద వేలేసుకుంటారు కూడా! ఇంతకీ ఆమె అక్కడ వున్న కొన్ని గంటలకి ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా, అక్షరాలా రూ. 40 లక్షలు. అంటే ఆ షాపు రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేసి అక్కడ కేవలం కొన్ని గంటలు మాత్రమే వుంది, అదీ కాకుండా కొన్ని వేలమంది జనాలు ఆ షాపు దగ్గరకి వచ్చారు. ఆ ఒక్క రోజు కోసం ఆమె పారితోషికం రూ. 40 లక్షలు అంటే, ఆమె డిమాండ్ ఏమీ ఇంకా తగ్గలేదని తెలుస్తోంది.