Tamanna: న్యూ ఇయర్ పార్టీలో విజయ్‌‌తో రొమాన్స్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-01-02T18:08:14+05:30 IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia).. ఈ మధ్య ఓ నటుడితో డేటింగ్ చేస్తుందనేలా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వార్తలను తన తాజా ఇంటర్వ్యూలో తమన్నా ఖండించినప్పటికీ..

Tamanna: న్యూ ఇయర్ పార్టీలో విజయ్‌‌తో రొమాన్స్.. వీడియో వైరల్
Tamanna and Vijay Varma

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia).. ఈ మధ్య ఓ నటుడితో డేటింగ్ చేస్తుందనేలా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వార్తలను తన తాజా ఇంటర్వ్యూలో తమన్నా ఖండించినప్పటికీ.. నిప్పు లేనిదే పొగ రాదు అనేలా అయితే ఇంకా వార్తలు హైలెట్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ (New Year Celebrations)లో భాగంగా.. అంతకుముందు ఏ నటుడి విషయంలో అయితే ఆమెపై వార్తలు వచ్చాయో.. అదే నటుడితో రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నటుడు ఎవరో కాదు.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘MCA’ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ వర్మ. టాలీవుడ్‌లో ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టినా.. బాలీవుడ్‌లో మాత్రం విజయ్ వర్మ (Vijay Varma) బిజీ నటుడిగానే కొనసాగుతున్నారు. తమన్నా, విజయ్ వర్మ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారనేలా ఈ మధ్య వార్తలు వినిపించాయి. త్వరలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలని తమన్నా ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఖండించింది.

Tam.jpg

ప్రేమ, పెళ్లి ఏదైనా సరే.. ముందుగా మీడియాకు చెప్పే చేసుకుంటాననేలా ఆమె చెప్పుకొచ్చింది. ఆమె ఈ మాటలు చెప్పి కొన్ని రోజులు కూడా గడవక ముందే.. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలలో ఇలా దొరికేసింది. ఈ వీడియోలో విజయ్ వర్మ వైట్ షర్ట్‌లో ఉండగా.. తమన్నా మాత్రం పింక్ కలర్ డ్రస్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో ఓ మూలన ఉన్న వీరిద్దరూ.. హగ్ చేసుకుని, కిస్‌ పెట్టుకుంటున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. దీంతో తమన్నా, విజయ్ వర్మ డేటింగ్‌లో ఉన్నారనే విషయం కన్ఫర్మ్ చేసినట్లయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ వీడియోపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Updated Date - 2023-01-02T18:08:16+05:30 IST