SSMB28: జూన్ లో కూడా లేదు అంటున్నారు, ఇంతకీ ఏమైంది

ABN , First Publish Date - 2023-05-09T14:45:37+05:30 IST

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలెట్టే సూచనలు కనపడటం లేదు అని తాజా సమాచారం ప్రకారం తెలిసింది. మే నెలలో ఉండదు, అయితే జూన్ నెల చివరి వారం లో ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు అని టాక్. ఇంతకీ ఏమైంది..

SSMB28: జూన్ లో కూడా లేదు అంటున్నారు, ఇంతకీ ఏమైంది

మహేష్ బాబు (MaheshBabu) , త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas కాంబినేషన్ సినిమా #SSMB28 మొదటి నుండీ వార్తల్లో వుంది, ఎందుకంటే మొదటి నుండీ ఆ సినిమాకి అరిష్టాలే, అందుకోసమే. ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ, ఈరోజు వరకు నత్తనడకలా సాగుతూనే వుంది. జనవరిలో సంక్రాంతికి మళ్ళీ షూటింగ్ మొదలెట్టారు, కొన్నిరోజులు చేశారు, మళ్ళీ ఆపేసారు. ఏమైంది అని రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ కథ పూర్తిగా చెప్పలేదు అని, మహేష్ కి త్రివిక్రమ్ కి చెందిందని, ఇక ఏవేవో వార్తలు వినవచ్చాయి. అందులో నిజమెంతో త్రివిక్రం, మహేష్ బాబు, ఆ సినిమా నిర్మాతలకు మాత్రమే తెలియాలి.

mahesh_7e6e6d66f2.jpg

అయితే మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లి వచ్చాక షూటింగ్ మార్చిలో మొదలెట్టొచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ షూటింగ్ వాయిందా పడింది. ఈలోపు సాంఘీక మాధ్యమం లో వార్తలు ఈ సినిమా మీద వైరల్ అవటంతో నిర్మాత నాగవంశీ (NagaVamsi) ఒక ప్రకటన చేసాడు, త్వరలో షూటింగ్ మొదలెడతాం, జనవరి కి ఈ సినిమా విడుదల మర్చిపోవద్దు అని.

కానీ అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జూన్ 20 తరువాతే ఉండొచ్చు అని అంటున్నారు. అంటే మే నెల అంతా ఏమీ ఉండదు. మహేష్ బాబు, కుటుంబంతో సహా వెకేషన్ కి వెళ్ళాడు, కానీ కుటుంబం తిరిగి వచ్చింది, మహేష్ బాబు ఇంకా వెకేషన్ లోనే వున్నాడు. కొందరు మహేష్ బాబు ఎదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అందుకని షూటింగ్ అవటం లేదు అని అంటున్నారు, కొన్ని వార్తలేమో మహేష్ ట్రైనింగ్ లో వున్నాడు అని. ఏ ట్రైనింగ్, దేనికోసమో తెలియదు. మరికొన్ని వార్తలు త్రివిక్రమ్ స్టోరీ పూర్తి కాలేదు, పూర్తి చేసాక షూటింగ్ మొదలెడతారు, అని. ఈ లెక్కన చూసుకుంటే, అసలు ఈ సినిమా షూటింగ్ అవుతుందా, లేదా అసలు సినిమానే ఉంటుందా, ఉండదా అని కొంతమందికి డౌట్ వస్తోంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

mahesh-trivikram.jpg

ఎందుకంటే ఇప్పటికి కేవలం ఒక 10 శాతం మాత్రమే షూటింగ్ అయి ఉంటుంది అని అంటున్నారు. ఓవేళ జూన్ లో షూటింగ్ మొదలెట్టినా, ఆరు నెలల్లో పూర్తి చేసి, జనవరి కి విడుదల చెయ్యగలరా అని డౌట్ కూడా వస్తోంది అని టాక్ నడుస్తోంది. మహేష్ బాబు, దీని తరువాత రాజమౌళి (Rajamouli) తో సినిమా #SSMB29 చెయ్యాల్సి వుంది ఒకవేళ ఆ సినిమా కూడా మధ్యలో లాంచ్ అయితే, త్రివిక్రమ్ సినిమా ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు. ఏమైనా కూడా ఈ మహేష్, త్రివిక్రమ్ సినిమా మీద నిర్మాతలు ఒక క్లారిటీ ఇవ్వాల్సి వుంది. లేదంటే ఇంకా ఈ సినిమా మీద అనుమానాలు బాగా పెరిగే అవకాశాలు వున్నాయి అని టాక్.

Updated Date - 2023-05-09T14:45:37+05:30 IST