Sreeleela: శ్రీలీల క్రేజ్ పోయిందా, లేక ఆమె పాత్ర బాగోలేదా

ABN , First Publish Date - 2023-10-04T12:37:21+05:30 IST

ఒక డజను సినిమాలు వరసగా వొప్పుకొని సెన్సేషనల్ క్రియేట్ చేసిన శ్రీలీల 'ధమాకా' సినిమాతో ఆ క్రేజ్ మరింత పెంచుకుంది. ఈమధ్య విడుదలైన 'స్కంద' సినిమాలో మాత్రం ఆమె గురించి ఎవరూ మాట్లాడటం లేదు. సినిమా కూడా అంతంత మాత్రంగానే అంటున్నారు, అంటే ఆమె క్రేజ్ తగ్గిందా, లేక వచ్చిన సినిమాలన్నీ చేసేస్తోందా అని పరిశ్రమలో టాక్.

Sreeleela: శ్రీలీల క్రేజ్ పోయిందా, లేక ఆమె పాత్ర బాగోలేదా
Ram Pothineni and Sreeleela from Skanda

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న వినిపిస్తున్న కథానాయకురాలు పేరు శ్రీలీల (Sreeleela). వరసగా అగ్ర నటులతో సినిమాలు చేస్తూ, చేతిలో డజను సినిమాలు పైగా వున్న శ్రీలీల మొదటి సారిగా ఒక అపజయం చూసేటట్టుగా కనపడుతోంది. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ లేనట్టుగా అందరికీ శ్రీలీలే కథానాయకురాలుగా కావాలని చాలా సినిమాల్లో ఆమెనే పెట్టుకున్నారు. శ్రీలీల కూడా ఇదే అదునుగా అన్ని సినిమాలు ఒప్పేసుకొని, షిఫ్ట్ పద్ధతిలో సినిమాల షూటింగ్స్ చేస్తూ పూర్తి చేస్తోంది. ఇలా ఆమె సినిమాలు నెలకి ఒకటి రెండు విడుదలయ్యే పరిస్థితి వుంది ఇప్పుడు.

sreeleela-gunturkaram.jpg

ఇలా ఎన్నో సినిమాల ఒప్పుకున్న దాంటోలో భాగంగానే రామ్ పోతినేని (RamPothineni) పక్కన నటించిన 'స్కంద' సినిమా గతా వారం విడుదలైంది. బోయపాటి శ్రీను (BoyapatiSreenu) దీనికి దర్శకుడు. అంతకు ముందు రవితేజతో (RaviTeja) 'ధమాకా' #Dhamaka అనే సినిమా చేసినప్పుడు అందరూ శ్రీలీల డాన్స్ గురించి, ఆమె గురించి మాట్లాడుకున్నారు. 'ధమాకా' విజయం సాధించటంలో శ్రీలీల ఒక కీలక పాత్ర పోషించింది. ఆమె క్రేజ్ పెరిగింది, ఇక వరసగా అందరూ ఆమెనే కధానాయికగా ఉండాలని చాలా సినిమాల్లోకి తీసుకున్నాడు.

sreeleela (1).jpg

ఇప్పుడు 'స్కంద' #Skanda సినిమాలో శ్రీలీల గురించి ఒక్కరూ కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇందులో పాటలు వెండి తెర మీద అంతంత మాత్రంగానే వున్నాయి. అదీ కాకుండా సినిమాలో ఆమె పాత్ర తీరుతెన్నులు కూడా సరిగా లేవు. ఒక బలమైన పాత్రలా కాకుండా, కేవలం పాటలకి, ఇంకో మూడు నాలుగు సన్నివేశాలకి కథానాయిక ఉండాలి కాబట్టి ఆమెని పెట్టుకున్నారా అన్నట్టుగా ఆమె పాత్ర డిజైన్ చేశారు. సినిమాకి చాలా ఆదాయం రావాలి, రానున్న రోజుల్లో చాలా సినిమాలు విడుదలకి వస్తున్నాయి, అందువలన ఈ సినిమా రూ. 40 కోట్లు పైనే కలెక్టు చెయ్యాలంటే కష్టమే అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. ఈ లెక్కన చూస్తే మరి శ్రీలీల క్రేజ్ తగ్గినట్టా, లేక ఆమెని సరిగ్గా సినిమాలో బలమైన పాత్రలో చూపించలేకపోయారా?

ఆమె కూడా ఇలా ఇన్ని సినిమాలు ఒప్పుకునే బదులు అందులో తన పాత్ర కూడా చూసుకుంటే బాగుంటుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. లేదంటే ఆమె క్రేజ్ తగ్గే అవకాశం వుంది అని అంటున్నారు. ముందు ముందు ఆమెవి చాలా సినిమాలు విడుదలకి సిద్ధంగా వున్నాయి. బాలకృష్ణ (NandamuriBalakrishna) సినిమా 'భగవంత్ కేసరి' #BhagavanthKesari, వైష్ణవ తేజ్ (VaishnavTej)తో 'ఆదికేశవ', #AadiKeshava నితిన్ (Nithiin) పక్కన ఒక సినిమాలో, అలాగే మహేష్ బాబు (MaheshBabu) తో 'గుంటూరు కారం' #GunturKaaram ఇలా వరస సినిమాలు విడుదలకి వున్నాయి. వాటిలో ఆమె ఎలా చేయబోతోంది అన్న విషయం మీదే ప్రేక్షకులకి ఆసక్తిగా వుంది అని తెలుస్తోంది.

Updated Date - 2023-10-04T12:37:21+05:30 IST