Extra Ordinary Man: రాజశేఖర్ రెమ్యూనరేషన్ వింటే షాకవుతారు, ఎంతో తెలుసా...

ABN , First Publish Date - 2023-12-12T15:38:41+05:30 IST

సీనియర్ నటుడు రాజశేఖర్ గతవారం విడుదలైన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసమని రాజశేఖర్ కేవలం వారం రోజులు మాత్రమే షూటింగ్ చేసినట్టు భోగట్టా. ఇంతకీ అతని పారితోషికం ఎంతో తెలుసా, తెలిస్తే షాకవుతారు...

Extra Ordinary Man: రాజశేఖర్ రెమ్యూనరేషన్ వింటే షాకవుతారు, ఎంతో తెలుసా...
Director Vakkantham Vamsi, producer Sudhakar Reddy and Rajasekhar

సీనియర్ నటుడు రాజశేఖర్ (Rajasekhar) చాలా కాలం తరువాత ఒక ప్రత్యేక పాత్ర చేశారు. ఈమధ్యనే విడుదలైన, నితిన్ (NIthiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' #ExtraOrdinaryMan సినిమాలో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర చేశారు. వక్కంతం వంశి (VakkanthamVamsi) దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో రాజశేఖర్ రెండో సగంలో వస్తారు, పోలీసాఫీసరుగా కనపడతారు. రాజశేఖర్ కథానాయకుడిగా చాలా సినిమాలల్లో నటించారు, ఆ తరువాత ఎక్కడా క్యారెక్టర్ నటుడిగా కనపడలేదు, కానీ ఈ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా మాత్రమే ఒప్పుకున్నారు.

ఈ సినిమా గతవారం విడుదలైంది కానీ ఆశించినంత ఫలితం రాలేదు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికిత రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలు. అయితే ఇందులో రాజశేఖర్ తాను పోషించిన పాత్రకి ఎంత పారితోషికం తీసుకున్నారో తెలిస్తే షాకవుతారు. అక్షరాలా రెండున్నర కోట్లు రూపాయలు పారితోషికం తీసుకున్నారు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. (Rajasekhar has taken Rs 2.5 crore remuneration for his special role in ExtraOrdinaryMan)

extraordinarymanrajasekhar.jpg

పోనీ ఆ సినిమాకి అతని పాత్ర వలన ఎక్స్‌ట్రా టికెట్స్ ఏమైనా వచ్చాయా అంటే, ఏమీ రాలేదు. అతని పాత్రకి ప్రేక్షకుల నుండి ఆశించినంత స్పందన కూడా రాలేదని తెలుస్తోంది. సినిమా మొదటి రోజే ఈ సినిమా పెద్దగా నడవదు అని తెలిసిపోయింది. సినిమాలో మొదటి సగం అంతా వినోదాత్మకంగా సాగితే, రెండో సగంలో కథ లేకుండా దర్శకుడు వంశి ఏదేదో చేశారు. అందులో రాజశేఖర్ పరిచయం, అతని పాత్ర కూడా ప్రేక్షకులకి అంతగా ఎక్కలేదు అని తెలిసింది. ట్రైలర్ లో చూపించిన 'జీవిత' అనే సరదా సన్నివేశం మాత్రమే నవ్విస్తుంది అని చెపుతున్నారు.

అయితే ఈ సినిమాకి రాజశేఖర్ మాత్రమే కావాలని దర్శకుడు వంశి పట్టుబట్టి మరీ అతని చేత చేయించుకున్నారు అని తెలిసింది. దర్శకుడు పెట్టిన ఒత్తిడికి తలవొగ్గి నిర్మాత సుధాకర్ రెడ్డి వేరే దారిలేక రాజశేఖర్ కి అంత పారితోషికం మరీ ఇచ్చి ఈ సినిమా చేయించినట్టుగా తెలిసింది. అంతే కాకుండా అతని పాత్రకి డబ్బింగ్ చెప్పిన సాయి కుమార్ కి మళ్ళీ వేరే పారితోషికం ఇవ్వాలి. ఈ సినిమాకి నిర్మాతగా సుధాకర్ రెడ్డి భారీగానే ఖర్చు పెట్టారని, అయితే సినిమా ఫలితం కూడా నిర్మాతకి ముందుగానే తెలుసు అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా మధ్యలో ఆగిపోవాల్సిందని, అయితే నిర్మాత వేరే గత్యంతరం లేక పూర్తి చెయ్యాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది. వక్కంతం వంశి రచయితగా, దర్శకుడిగా ఈ సినిమాతో ఇంకో పెద్ద ఫ్లాపు రుచిచూసినట్టయింది.

Updated Date - 2023-12-12T15:38:42+05:30 IST