Samantha: ఆ సినిమా ప్రచారానికి వచ్చాకే అమెరికాకి పయనం !

ABN , First Publish Date - 2023-08-07T18:13:17+05:30 IST

విజయ్ దేవరకొండ తో పాటు సమంత 'ఖుషి' సినిమా ప్రచారాల్లో సమంత పాల్గొంటుందా, లేదా అలానే అమెరికా వెళ్లిపోతుందా? ఈ ప్రశ్న చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇంతకీ సమంత ఏమి నిర్ణయం తీసుకుందో చదవండి.

Samantha: ఆ సినిమా ప్రచారానికి వచ్చాకే అమెరికాకి పయనం !
Samantha

మళ్ళీ ఇప్పుడు అందరి దృష్టి సమంత (Samantha) పైనే వుంది. ఎందుకంటే ఆమె, విజయ్ దేవరకొండ (VIjayDeverakonda) జంటగా నటించిన 'ఖుషీ' #Khushi సినిమా సెప్టెంబర్ 1 (September 1) వ తేదీన థియేటర్స్ లో విడుదలవుతోంది. దీనికి శివ నిర్వాణ (ShivaNirvana) దర్శకుడు. ముందుగా ఈ చిత్ర నిర్వాహకులు ఈ సినిమా ట్రైలర్ ని ఆగష్టు 9 (Khushi Trailer on August 9) అంటే బుధవారం విడుదల చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం అయింది. కథానాయిక సమంత తనకి విశ్రాంతి అవసరం అని ఈమధ్యనే ఇండోనేసియాలోని బాలి #Bali పట్టణంలో చాలా రోజులు సేద తీరి, ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) వచ్చింది. మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంది ట్రీట్ మెంట్ కి అంటున్నారు.

khushistill.jpg

ఇప్పుడు అందరి మదిలో వున్న ప్రశ్న ఏంటంటే, సమంత ఈ 'ఖుషీ' #Khushi సినిమా ప్రచారాలకు వస్తుందా, లేదా ముందుగానే అమెరికా వెళ్లిపోతుందా అన్నది. ఎందుకంటే 'ఖుషీ' సినిమా ప్రచారాలకు ఆమె అవసరం చాలా వుంది. ఈ సినిమా ఆమె మయోసిటిస్ (Myositis) అనే వ్యాధి బారిన పడక ముందు మొదలయింది, మధ్యలో ఆ వ్యాధి వచ్చి ఆమె ట్రీట్ మెంట్ తీసుకోవడానికి ఈ సినిమా చాలా రోజులు షూటింగ్ ఆగిపోయింది. కోలుకున్నాక ఈమధ్యనే ఈ సినిమా పూర్తి చేసి, మళ్ళీ ఇప్పుడు విశ్రాంతి అవసరం అని ఇక వేరే సినిమా ఏమి చెయ్యకూడదు అని నిర్ణయం తీసుకుంది.

తాజా సమాచారం ప్రకారం సమంత 'ఖుషీ' సినిమా ప్రచారాలకు హాజరవ్వాలని నిర్ణయించుకుంది అని తెలిసింది. ఎందుకంటే ఇదొక్కటే సినిమా మళ్ళీ ఆమె ఏదైనా ఒప్పుకునే వరకు, అదీకాకుండా ఈ సినిమా షూటింగ్ తన వలన చాలా ఆలస్యం అయింది కాబట్టి, ఈ సినిమా ప్రచారాలు చేసి అమెరికా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా భోగట్టా. అందుకే ఆమె అమెరికా పయనం సెప్టెంబర్ మొదటి వారంలో పెట్టుకుంది అని తెలిసింది.

samantha-khushi.jpg

ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 9, తరువాత ప్రచారాల్లో భాగంగా పర్యటనలు, తరువాత ప్రీ రిలీజ్ వేడుక, ఇలా అన్నిటిలో సమంత పాల్గొంటుంది అని కూడా నాటున్నారు. సమంత ఇంతకు ముందు దర్శకుడు శివ నిర్వాణతో 'మజిలీ' #Majili అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఖుషి' సినిమా చేస్తోంది, (KhushiReleasingonSpetember1) ఇది సెప్టెంబర్ 1న తెలుగులో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

Updated Date - 2023-08-07T18:13:17+05:30 IST