MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-04-05T15:23:11+05:30 IST

గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులను గెలుచుకుని దేశ వ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్. కీరవాణి (MM. Keeravani). ఐదేళ్ల తర్వాత బాలీవుడ్‌ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఆయన చివరగా ‘మిస్సింగ్’ (Missing) కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులను గెలుచుకుని దేశ వ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్. కీరవాణి (MM. Keeravani). ఐదేళ్ల తర్వాత బాలీవుడ్‌ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఆయన చివరగా ‘మిస్సింగ్’ (Missing) కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. ఈ మూవీలో మనోజ్ బాజ్‌పాయ్, టబు కీలక పాత్రలు పోషించారు. ఎమ్‌ఎమ్. కీరవాణి (MM.Keeravani) సంగీతం అందించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను కైవసం చేసుకుంది. ఫలితంగా మేకర్స్ దృష్టి కీరవాణిపై పడింది. బాలీవుడ్ నుంచి కూడా దర్శకులు తమ సినిమాలకు సంగీతం అందించాలని కోరుతున్నారు.

‘ఔరన్ మే కహా దమ్ థా’ (Auron Mein Kahan Dum Tha) సినిమాకు ఎమ్ఎమ్. కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి నీరజ్ పాండే (Neeraj Pandey) దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ దేవగణ్, టబు హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘ఔరన్ మే కహా దమ్ థా’ ప్రేమ కథా చిత్రంగా రూపొందనుంది. ఈ మూవీలో జిమ్మి షెర్గిల్, సయిూ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో బాలీవుడ్ గురించి మాట్లాడుతూ వచ్చే ఆఫర్స్ ఆసక్తికరంగా లేని కీరవాణి తెలిపారు. ‘‘మహేశ్ భట్, ముకేశ్ భట్ నుంచి వచ్చిన చాలా చిత్రాలకు నేను సంగీతం అందించాను. ఈ సినిమాల్లోని పాటలు కూడా హిట్ అయ్యాయి. అనంతరం తెలుగు ఇండస్ట్రీలో నేను చాలా బిజీగా మారాను. బాలీవుడ్ మీద దృష్టి సారించలేకపోయాను. బీ టౌన్ నుంచి వచ్చే ఆఫర్స్ కూడా అంత ఆసక్తికరంగా లేవు’’ అని కీరవాణి పేర్కొన్నారు.

Ajay-Devgn.jpg

నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ‘స్పెషల్ 26’, ‘బేబీ’ చిత్రాలకు కీరవాణే మ్యూజిక్‌ అందించారు. ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ‘ఔరన్ మే కహా దమ్ థా’ కు ఆయనే సంగీతం అందించనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-05T15:28:27+05:30 IST