Renu Desai: రెండో వివాహం అప్పుడు క్యాన్సిల్ అయింది, కానీ మళ్ళీ చేసుకుంటాను

ABN , First Publish Date - 2023-10-18T14:43:19+05:30 IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో వివాహం గురించి మాట్లాడేరు. 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలో అభ్యుదయవాది, సంఘ సంస్కర్త అయిన హేమలతా లవణం పాత్రని పోషిస్తున్న రేణు దేశాయ్ పలు ఇంటర్వ్యూ లు ఇచ్చినప్పుడు ఎప్పుడు రెండో వివాహం చేసుకోవాలని వుందో చెప్పారు

Renu Desai: రెండో వివాహం అప్పుడు క్యాన్సిల్ అయింది, కానీ మళ్ళీ చేసుకుంటాను
Renu Desai

పవన్ కళ్యాణ్ (PawanKalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (RenuDesai) రెండో వివాహం గురించి మాట్లాడారు. రేణు దేశాయ్ చాలా కాలం తరువాత ఒక తెలుగు సినిమాలో నటించారు. రవితేజ (RaviTeja) నటించిన 'టైగర్ నాగేశ్వర రావు' #TigerNageswaraRao సినిమాలో రేణు దేశాయ్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఒక సంఘ సంస్కర్త, అభ్యుదయవాది అయిన హేమలత లవణం (HemalathaLavanam) పాత్రలో రేణు దేశాయ్ కనపడతారు. ఈ నేపథ్యంలో ఆమె పలు మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన రెండో వివాహం ప్రస్తావన కూడా వచ్చింది.

ఆ విషయం గురించి మాట్లాడుతూ ఆరేళ్ళ క్రితం తాను రెండో వివాహం చేసుకోవాలని అనుకున్నాను అని, నిశ్చితార్థం కూడా అయిందని, అప్పుడు సాంఘీక మాధ్యమంలో ఆ విషయం ద్రువీకరించానని చెప్పుకొచ్చారు. (Renu Desai talks about her second marriage) అయితే అప్పుడు ఆ నిశ్చితార్ధం క్యాన్సల్ చెయ్యాల్సి వచ్చిందని చెప్పారు. ఎందుకు అంటే అప్పుడు తన కుమార్తె ఆద్యకి కేవలం ఏడేళ్లు మాత్రమే అని, తన పిల్లలకి తన అవసరం చాలా ఉంటుందని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే అతనికి కూడా తాను సమయం కేటాయించాల్సి వస్తుందని చెప్పింది.

renudesai-marriage1.jpg

అందువల్ల పిల్లలతో ఎక్కువ సమయం ఉండటానికి ఇష్టపడి అప్పుడు జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకున్నట్టు చెప్పారు రేణు దేశాయ్. అయితే ముందు ముందు తాను రెండో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, అకిరా (AkiraNandan) కాలేజీకి వెళతాడు, ఆద్య (Aadhya) కి కూడా 13 ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు, అంటే వాళ్ళకి నా అవసరం ఎక్కువగా ఉండకపోవచ్చు. పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం అని, దానిమీద తనకి విశేషమైన నమ్మకం ఉందని చెప్పారు రేణు దేశాయ్.

తన పిల్లలు ఇద్దరూ ఆణిముత్యాలని, తాను వాళ్ళని బాగా పెంచానని అనుకుంటున్నాను అని చెప్పారు. ఇద్దరు పిల్లలు తనని రెండో పెళ్లి చేసుకోమన్నారని వాళ్లిద్దరూ తనకి బాగా సపోర్ట్ చేస్తారని చెప్పారు రేణు దేశాయ్. మంచి వ్యక్తి దొరికి, తనకి సంతోషంగా ఉంటుంది అంటే హ్యాపీగా రెండో వివాహం చేసుకో అని తన కొడుకు అకిరా అన్నాడని, అది విని తన కొడుకు అంటే గర్వం ఫీల్ అయ్యానని చెప్పారు రేణు దేశాయ్.

Updated Date - 2023-10-18T14:55:57+05:30 IST